Kushi Re Release Collections : దుమ్ములేపేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. 'ఖుషి'కి రికార్డ్ కలెక్షన్స్

Pawan Kalyan Kushi Re Release ఇప్పుడు అంతా కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈక్రమంలో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు మాత్రం నిజంగానే ఫుల్ ఖుషి అవుతోంది. అప్పుడు జల్సా, తమ్ముడు రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఖుషిని రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 10:27 AM IST
  • న్యూ ఇయర్ స్పెషల్‌గా ఖుషి
  • మళ్లీ విడుదల చేసినా తగ్గని క్రేజ్
  • కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్న ఖుషి
Kushi Re Release Collections : దుమ్ములేపేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. 'ఖుషి'కి రికార్డ్ కలెక్షన్స్

Kushi Re Release Day 1 Collection పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా డిసెంబర్ 31న స్పెషల్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఖుషి సినిమాను ముందుగా ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ సినిమాకు ఉన్న క్రేజ్ చూసిన మేకర్లు.. ఈ సినిమాను ఇంకా కొన్ని రోజులు ప్రదర్శించాలని ఫిక్స్ అయ్యారు. అలా నేడు కూడా ఖుషి సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే మొదటి రోజుకు ఖుషి సినిమా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది.

పాత సినిమాలను రీ రిలీజ్ చేయాలనే ట్రెండ్‌ను మహేష్‌ బాబు ఫ్యాన్స్.. పోకిరి సినిమాతో ప్రారంభించారు. అయితే పోకిరి సినిమాకు దాదాపు 1.7కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా జల్సాను రీ రిలీజ్ చేశారు. ఆ సినిమాకు మూడు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. జల్సా దెబ్బకు పోకిరి రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఇప్పుడు ఖుషి దెబ్బకు జల్సా రికార్డులు ఖతమయ్యాయి.

ఖుషి సినిమాకు మొదటి రోజు నాలుగున్నరకోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండో రోజున కోటిన్నరకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఈ పాత సినిమాల ట్రెండ్ వల్ల నిర్మాతలకు మళ్లీ జేబులు నిండుతున్నాయి. అభిమానులకు కడుపు నిండుతోంది. ఇక ఇప్పుడు అయితే ఖుషి మేనియాను చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ హవా ఎలా ఉంటుందో మరోసారి ఈ ఖుషి రీ రిలీజ్‌తో అర్థమైంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి మళ్లీ ఇలాంటి క్లాసిక్స్ వస్తాయా? అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. అలాంటి పాటలు, ఆ స్టైలిష్ లుక్, అలాంటి సెన్సిబుల్ కథలు ఇప్పుడు వస్తాయా? అని అనుకుంటున్నారు.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News