ఎన్టీఆర్ పేరును సజెస్ట్ చేసిన పవన్ కల్యాణ్

Last Updated : Oct 27, 2017, 02:11 PM IST
ఎన్టీఆర్ పేరును సజెస్ట్ చేసిన పవన్ కల్యాణ్

తెలుగు సినీ ఇండస్ట్రి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దిగ్గజ దర్శకుడు త్రివిక్రం చెప్పిన ఓ కథకు తాను సూట్ కానని..ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారని పవన్ సలహా ఇచ్చారట. అసలు వివరాల్లోకి వెళ్లినట్లయితే....ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఘూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తం షాట్‌కు క్లాప్ కూడా కొట్టిన విషయం తెలిసిందే.

వాస్తవానికి ఈ కథను రాసుకున్న త్రివిక్రమ్ వెంటనే మళ్లీ పవన్‌ను సంప్రదించాడట... పవన్ హీరోగా ఆ సినిమాను తెరకెక్కించాలని భావించారట త్రివిక్రమ్. కానీ ఆ కథకు తాను సూట్ కానని.. ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారని పవన్ సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకు త్రివిక్రమ్ కథను ఎన్టీఆర్‌కు వినిపించారని సమాచారం. కథ విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరోని సజెస్ట్ చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Trending News