Pawan Kalyan: పిల్లల‌తో ప‌వ‌న్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్

ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్‌తో ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ క్రమంలో కొంచెం సమయం దొరికినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యామిలీతో గ‌డిపేందుకు ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు.

Last Updated : Dec 2, 2020, 04:17 PM IST
Pawan Kalyan: పిల్లల‌తో ప‌వ‌న్.. ఫొటోను షేర్ చేసిన రేణూ దేశాయ్

Pawan Kalyan chills with kids - photo shared by Renu Desai: ఓ వైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్‌తో ఎప్పుడూ కూడా బిజీబిజీగా ఉంటారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈ క్రమంలో కొంచెం సమయం దొరికినా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యామిలీతో గ‌డిపేందుకు ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకు ఈ ఫొటోనే నిద‌ర్శ‌నం. తాజాగా రేణూ దేశాయ్ ( Renu Desai ) ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోను చూసి పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూతురు ఆధ్యా (Aadhya Konidala)‌, కొడుకు అకిరా నంద‌న్‌ (Akira Nandan) తో స‌ర‌దాగా దిగిన ఫొటోను రేణూదేశాయ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు రేణూ దేశాయ్ క్యాప్షన్ కూడా రాసింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

‘‘నా ఫోన్ కెమెరాతో తీసిన అరుదైన క్ష‌ణాల‌కు సంబంధించిన ఫొటో. వారు మీ ఫోన్ ఫొటో ఆల్బ‌మ్‌లల్లో ఉండని అంద‌మైన అరుదైన క్షణాలకు సంబంధించిన స్టిల్స్‌ను మీతో పంచుకుంటున్నా’’..అంటూ రేణూ దేశాయ్ క్యాప్ష‌న్ రాశారు. అయితే రేణూ ఈ ఫొటోకు కామెంట్స్ కనిపించ‌కుండా డిసేబుల్‌ చేశారు. అయితే ప‌వ‌న్ కల్యాణ్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. Also read: Bandla Ganesh: నా దేవుడిని అంటే సహించను: బండ్ల గణేష్

తెలుగు సినీ పరిశ్రమలో నటి రేణు దేశాయ్‌ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు ప్రక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ప్రేమించి పెళ్లి చేసుకోని.. విడిపోయినా తర్వాత కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్నారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ ఆద్య పేరుతో తెర‌కెక్క‌నున్న సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.

 

Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News