Vakeel Saab: రేసు నుంచి తప్పుకున్న వకీల్ సాబ్ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. పవర్ స్టార్ నటిస్తోన్న వకీల్ సాబ్ మూవీ కోసం పవర్ సాబ్ అభిమానుల్లో ఎంతో ఎదురుచూస్తున్నారు. పింక్ సినిమాకు తెలుగు రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

Last Updated : Nov 16, 2020, 11:55 PM IST
Vakeel Saab: రేసు నుంచి తప్పుకున్న వకీల్ సాబ్ ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. పవర్ స్టార్ నటిస్తోన్న వకీల్ సాబ్ మూవీ కోసం పవర్ సాబ్ అభిమానుల్లో ఎంతో ఎదురుచూస్తున్నారు. పింక్ సినిమాకు తెలుగు రీమేక్ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే వకీల్ సాబ్ విడుదల కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దాదాపు ఆరు, ఏడు నెలల గ్యాప్ తర్వాత అక్టోబర్ నుంచి వకీల్ సాబ్ షూటింగ్ కూడా పూర్తయింది. అక్టోబర్ చివరి నుంచి పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 

వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందని.. వచ్చే సంక్రాంతి రేసులో మిగతా సినిమాలకు పోటీగా వకీల్ సాబ్ కూడా విడుదల కానుందనే టాక్ బలంగా వినిపించింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ( Pawan Kalyan fans ) అందరూ వకీల్ సాబ్ సినిమాతో సంక్రాంతి సంబరాలు చేసుకోవచ్చని ఆశించారు.

Also read : Bigg Boss 4 Telugu: ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం !

ఇదిలావుంటే, తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్స్ ప్రకారం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ విడుదల ( Vakeel Saab release date ) విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సంక్రాంతి సమయంలో కాకుండా మార్చి నెలలో వకీల్ సాబ్ మూవీని విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. అదే కానీ నిజమైతే.. వకీల్ సాబ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూస్ కానుంది అంటున్నాయి సినీవర్గాలు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు.

Also read : Bigg boss 4 Telugu: బిగ్ బాస్ కంటెస్టంట్స్ గంగవ్వ, జోర్దార్ సుజాతలకు మరో ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x