Manikka Vinayagam: ప్రముఖ తమిళ్ సింగర్, నటుడు మాణిక్య వినాయగం (73) (Manikka Vinayagam) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అడయార్ లోని ఆయన ఇంట్లోనే అంత్యక్రియలు చేయనున్నట్లు సమాచారం. మాణిక్య వినాయగం 1943 డిసెంబరు 10న జన్మించారు. ఈయన 'నాట్యాచార్య పద్మశ్రీ' వజువూరు బి. రామయ్య పిళ్లై (Vazhuvoor B. Ramaiah Pillai) చిన్న కుమారుడు.
విక్రమ్ నటించిన ‘'దిల్’ (2001)' (Dhill Movie) అనే తమిళ చిత్రంతో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు మాణిక్య వినాయగం. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని అలపించారు. సింగర్ గానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు. 'తిరుద తిరుది' అనే సినిమాలో ధనుష్ తండ్రిగా నటించారు. పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇవే కాకుండా ఆయన జానపదాలు, భక్తి పాటలు మరో 1000 దాకా ఆలపించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన '‘శంకర్ దాదా ఎంబీబీఎస్'’ చిత్రంలోని ‘'పట్టుపట్టు చేయ్యే పట్టు'’తో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు.
Also Read: Vadivelu: స్టార్ కమెడియన్‌కు కరోనా.. ఒమిక్రాన్‌గా అనుమానం! ఆందోళనలో చిత్ర యూనిట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook