Umpire Batter Funy Video: అంపైర్‌ను కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

PAK vs ENG, Pakistan Batter Haider Ali hits Umpire Aleem Dar. పాకిస్తాన్ బ్యాటర్ హైదర్‌ అలీ అంపైర్‌ అలీమ్‌ దర్‌ను బంతితో బాదాడు. నొప్పి తట్టుకోలేని అంపైర్‌ తన బ్యాక్‌ను రుద్దుకున్నాడు.

Written by - P Sampath Kumar | Last Updated : Oct 1, 2022, 04:42 PM IST
  • అంపైర్‌ను కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్
  • వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
  • అంపైర్‌ ఎక్స్‌ప్రెషన్‌ బాగున్నాయి
Umpire Batter Funy Video: అంపైర్‌ను కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

 Pakistan Batter Haider Ali slams Umpire Aleem Dar with ball: క్రికెట్‌ ఓ ఫన్నీ గేమ్‌. క్రికెట్ ఆటలో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ గేమ్‌లో కొన్ని సంఘటనలు నవ్వులు తెప్పిస్తే.. మరికొన్ని ఆహ అనిపిస్తాయి. ఇంకొన్ని మాత్రం అయ్యో పాపం అనుకునేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ హైదర్‌ అలీ అంపైర్‌ అలీమ్‌ దర్‌ను బంతితో బాదాడు. నొప్పి తట్టుకోలేని అంపైర్‌ తన బ్యాక్‌ను రుద్దుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

టీ20, టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్‌లో ఇంగ్లండ్‌ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆరో టీ20 మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పాక్ జట్టు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అంపైర్‌ అలీమ్‌ దర్‌కు బంతి తాకింది. ఆరో ఓవర్ రిచర్డ్‌ గ్లీసెన్‌ బౌలింగ్‌ చేయగా.. హైదర్‌ అలీ పుల్‌షాట్‌ ఆడాడు. బంతి లెగ్‌ అంపైర్‌ అలీమ్‌ దర్‌ బ్యాక్‌కు గట్టిగా తగిలింది. అంపైర్‌ బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. అది సాధ్యం కాలేదు. 

నొప్పితో బాధపడిన అలీమ్‌ దర్‌ తన బ్యాక్‌ను చేతితో కాసేపు రుద్దుకున్నాడు. ఇది చూసిన మైదానంలోని ప్లేయర్స్ నవ్వులు పూయించారు. ఇక బౌలర్‌ రిచర్డ్‌ గ్లీసెన్‌.. అలీమ్‌ దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు షేర్‌ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సూపర్ షాట్, అంపైర్‌ ఎక్స్‌ప్రెషన్‌ బాగున్నాయి అని కామెంట్స్ చేశారు. 

Also Read: Trisha Krishnan Hot Pics: అబ్బబ్బ ఏమందంరా బాబు.. దేవకన్యలా మెరిసిపోతున్న త్రిష!
Also Read: GST Collections: దేశంలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News