Kalki 2898AD collections day 2: ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా మొదటి రోజే వసూళ్లతో సునామీని.. సృష్టించింది. అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, కమల్ హాసన్, వంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం నిర్మాత అశ్విని దత్త 600 కోట్ల..బడ్జెట్‌ను వెచ్చించారు. అదే రేంజిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది.
మొదటిరోజు కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ..దేశవ్యాప్తంగా 111 కోట్ల గ్రాస్.. కలెక్షన్లు అందుకుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కలిపి 67 కోట్లు వసూలు చేయగా, కర్ణాటకలో 12.5 కోట్లు, తమిళనాడులో ఐదు కోట్లు, కేరళలో మూడు కోట్లు, హిందీలో 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో 40 కోట్లు మిగతా దేశాలు.. మొత్తం కలుపుకొని 80 కోట్ల వరకు కలెక్షన్లు మొదటి రోజు నమోదు అయ్యాయి.
రెండవ రోజు కూడా కల్కి కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. హైదరాబాద్‌లో 65%, వరంగల్‌లో 60%, వైజాగ్‌లో 58%, కరీంనగర్ 55%, మహబూబ్ నగర్ 83%, కాకినాడ 55 % ఆక్యుపెన్సీ నమోదు అయింది.
కలెక్షన్ల పరంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో.. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా.. హిందీలో 20 కోట్లు కలెక్షన్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు 85 నుంచి 90 కోట్ల వరకు నమోదు.. అయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజు 191 కోట్లు, రెండవ రోజు 90 కోట్ల వరకు కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా రెండు రోజుల్లోనే 280 నుంచి 300 కోట్ల మధ్య కలెక్షన్లు అందుకుంది. ఇక వారాంతం పూర్తయ్యేసరికి సినిమా 1000 కోట్ల.. క్లబ్బులో చేరిపోతుంది అని ట్రెడ్ వర్గాలు సూచిస్తున్నాయి.
మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ.. అది సినిమా కలెక్షన్ల మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. ప్రభాస్ అదిరిపోయే పర్ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్లు గా నిలిచాయి. ఇక నాగ్ అశ్విన్ స్టోరీ టెల్లింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి