Salaar : సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. రన్ టైం ఎంతో తెలుసా

Salaar Censor : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా స‌లార్‌. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆ వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2023, 09:09 PM IST
Salaar : సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. రన్ టైం ఎంతో తెలుసా

Salaar Run-Time: ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్రభాస్ సలార్ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ చిత్రం మొదటి భాగం సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేయాలి అనుకుంటున్నారు మేకర్స్. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 1న ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా.. ట్రైలర్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది. అన్ని భాష‌ల్లో క‌లిపి 150 మిలియ‌న్లకి పైగా వ్యూస్ వ‌చ్చాయి.  ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేమిటి అంటే ఈ చిత్రం సెన్సార్  పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సినిమా కదా తప్పకుండా యూ లేదా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చుంటుంది అని అనుకుంటే మాత్రం పొరపాటే.  ఈ చిత్రానికి సెన్సార్ బృందం ‘ఏ’ స‌ర్టిఫికెట్‌ ఇచ్చిన‌ట్లు టాక్. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్ లాగానే ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్లు అలానే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అని ఈ చిత్ర ట్రైలర్ చూస్తే అర్థమయిపోతోంది. ఇక ఈ కారణంగానే ఈ సినిమాకి ‘ఏ’ స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ట‌. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న మరో వార్త ఏమిటి అంటే ఈ సినిమా ర‌న్‌టైమ్ విష‌యానికి వ‌స్తే 2 గంట‌ల 55 నిమిషాల 22 సెక‌న్లు ఉండబోతోంది అని టాక్. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి ఈ చిత్రం మొదటి భాగంలో ప్రభాస్ చాలా తక్కువ సేపు కనిపిస్తారేమో అనే సందేహం అందరిలో నెలకొంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రెన్స్ కూడా చాలా ఆలస్యం అవ్వచ్చు అని అందరూ భావించాడు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మూవీ మొద‌లైన అర‌గంట త‌రువాత ప్ర‌భాస్ ఎంట్రీ ఉంటుంద‌ట.

ఇక మరో విషయం ఏమిటి అంటే ఈ సినిమా మేకప్ ఈ చిత్రం  రెండో ట్రైల‌ర్ విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉంద‌రట‌. ఆ ట్రైల‌ర్ మొత్తం ప్ర‌భాసే ఉంటాడ‌ని అంటున్నారు. కాగా ఈ సినిమా రెండో ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 16న లేదా 18న విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 

Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News