Prabhas: రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ గిఫ్ట్.. ఇంతకీ అదేమిటంటే..

Kalaki 2898AD: తన తోటి నటులు అందరితోనూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ అలరిస్తూ ఉంటారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో రామ్ చరణ్ కూతురికి పంపించిన గిఫ్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 3, 2024, 01:52 PM IST
Prabhas: రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ గిఫ్ట్.. ఇంతకీ అదేమిటంటే..

Prabhas-Ram Charan: ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ మధ్యనే సలార్ సినిమాతో మంచి విజయం అందుకున్న ..ఈ హీరో త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898AD చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ సినిమా నుంచి బుజ్జి అనే రోబో కారు ని యూనిట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రోబో కి పెద్ద వాళ్ల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఎంతోమంది ఫాన్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో రామ్ చరణ్ కూతురు క్లిమ్ కారా కూడా చేరిపోయింది.

అసలు విషయానికి వస్తే ‘బుజ్జి అండ్ భైరవ' పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్‌ను ఈ మధ్యనే సినిమా యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కాగా తాజాగా మరో వెరైటీ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సినీ సెలబ్రిటీల పిల్లలకి కల్కి టీమ్ గిఫ్ట్‌లు పంపుతోంది. 

ఇక తాజాగా రామ్‌ చరణ్‌ కుమార్తె క్లీంకారకి కూడా సినిమా యూనిట్‌ ఓ బహుమతి అందించింది. ఇందులో బుజ్జి - భైరవ స్టికర్స్‌, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్‌ లాంటివి చాలా ఉన్నాయి. క్లీంకార వీటితో ఆడుకుంటున్న ఫొటోలను తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కల్కి టీమ్‌కి థ్యాంక్స్‌ చెబుతూ సినిమాకి 'ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కూతురికే కాకుండా మరి కొంతమంది సెలబ్రిటీస్ పిల్లలకి కూడా త్వరలోనే ప్రభాస్..ఇక కల్కి సినిమా యూనిట్ ఈ గిఫ్ట్స్ ని పంపించనుంది అని వినికిడి.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది అని సమాచారం. ఈ చిత్రం..  హాలీవుడ్ లెవల్లో సినిమా ఉంటుందని  అభిమానులకు ఈ సినిమా సూపర్ ట్రీట్ అంటూ నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. ఇక ఇదే ఫాలో అవుతూ ఈ సినిమా ట్రైలర్ తోనే ఈ సినిమాపై మరిన్ని అంచనాలని ఈ ట్రైలర్ విషయంలో యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి అంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..

Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News