Prathyaksha Daivam Sai Songs Released: మతాలతో సంబంధం లేకుండా దాదాపు ప్రజలంతా దైవ స్వరూపంగా భావించే షిరిడి సాయి గురించి ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. వచ్చిన దాదాపు అన్ని సినిమాలు ప్రేక్షకులను అల్లరించాయి. ఇప్పుడు షిరిడి సాయి భక్తుల అనుభవాలను ఆధారంగా మరో సినిమా తెరకెక్కుతోంది. దత్త ఫిలిమ్స్ నిర్మాణంలో రామలింగారెడ్డి షిరిడి సాయిగా ప్రధాన పాత్రలో నటించిన ప్రత్యక్ష దైవం శిరిడి సాయి అనే సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది.
భానుచందర్, సీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియో వీడియో పాటల ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. శ్రీ భంసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్రాంత ఇన్కమ్ టాక్స్ ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ నరసింహప్ప అధ్యక్షతన జరిగిన ఈ పాటల ఆవిష్కరణ ప్రోగ్రాంలో దర్శకుడు ఓం సాయి ప్రసాద్, రేలంగి నరసింహారావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్, లిరిక్ రైటర్ బిక్కి కృష్ణ, ఏసీబీ రామదాస్ తేజ, లయన్ డాక్టర్ విజయకుమార్, వీ.డి రాజగోపాల్, శ్రీమతి గిడుగు ఖ్యాతి కృష్ణ వంటి వారు పాల్గొన్నారు.
Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
ఈ సందర్భంగా దాదాపు 100 సినిమాలకు పైగా సినిమా తెరకెక్కించిన ఓం సాయి ప్రకాష్ మాట్లాడుతూ సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికి తాను కర్ణాటక పంపించారని ఈ సమయంలో రామలింగా రెడ్డి సాయి పాత్రను ధరించి సాయి భక్తుల అనుభవాలతో సినిమా చేయడం అభినందనీయమని అన్నారు.
చీఫ్ కమీషనర్ నరసింహప్ప మాట్లాడుతూ... సాయి తత్వాన్ని జనంలోకి తీసుకొనిపోవడానికి సినిమా మీడియా బాగా ఉపయోగపడుతుందని, ఈ క్రమంలో యువతరంలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రత్యక్షదైవం షిర్డిసాయి చిత్రాన్ని మచ్చా రామలింగారెడ్డి నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. భక్తిరస చిత్రాన్ని యం.ఆర్.రెడ్డి నిర్మించడం అభినందనీయమని ఈ క్రమంలో ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొండవీటి సత్యం, నిర్మాత వెంకట్, నిర్మాత సుబ్బారావు, సంగీత దర్శకుడు కిషన్ కవాడియా తదితరులు కూడా పాల్గొని ప్రసంగించారు.
Also Read: Salaar Release Date:సలార్ రిలీజ్ డేట్ టెన్షన్.. అసలు విషయం చెప్పేసిన టీం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook