Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమాలో ఆఫర్... వర్క్ ఫ్రం హోం ఆప్షన్

Kalki Work From Home: ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ సినిమా కల్కి 2898AD. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం అందిస్తుంది ఈ సినిమా యూనిట్..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 06:43 PM IST
Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమాలో ఆఫర్... వర్క్ ఫ్రం హోం ఆప్షన్

Prabhas: సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరసగా  తన సినిమాలో షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో అంచనాలు ఎక్కువగా ఉండే చిత్రం కల్కి 2898AD. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకొనే, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, ఫస్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. హై బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హిందూ మైథలాజి కథతో ఫ్యూచరిస్టిక్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈక్రమంలోనే ఎడిటింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ ని మొదలు పెట్టబోతున్నారు.

మోడరన్ టెక్నాలజీ, సూపర్ హీరో సూట్స్, వినూత్నమైన ఆయుధాలు.. ఇలా ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సౌండ్ డిజైన్ అన్నది చాలా ముఖ్యమైంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆడియన్స్ కి తెలియజేసేలా ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ అనేది జరగాలి. అందుకని ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం టాలెంట్ ఉన్న వారిని వెతుకుతున్నాడు. ఇలా చెయ్యడం ద్వారా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇయ్యొచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు దర్శకుడు. ఇక ఇదే విషయం తెలియజేస్తూ..కల్కి మూవీ టీంలో పని చేసేందుకు అవకాశం ఉందని ఒక ప్రకటన విడుదల చేశారు.

కల్కి సినిమాకి సౌండ్ డిజైనర్స్ అండ్ ఎడిటింగ్ చేసేవారు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతేకాదు వీరు కలిగించిన మరో ఆప్షన్ ఏమిటి అంటే.. ఫ్రీలాన్స్ ద్వారా ఇంటి దగ్గర నుంచే కల్కి టీంతో వర్క్ చేయొచ్చు. మరి మీకు సౌండ్ మిక్సింగ్ పై అవగాహన ఉంటే.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. vymcrew@gmail.com ద్వారా కల్కి మూవీ యూనిట్ ని కాంటాక్ట్ అవ్వండి.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News