Prema Entha Madhuram Title Song With Real Couple:జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే పాపులర్ సీరియల్ 'ప్రేమ ఎంత మధురం' బుల్లితెరపై కొత్త చరిత్ర సృష్టించింది. టెలివిజన్ చరిత్రలోనే తొలిసారిగా ఈ సీరియల్ టైటిల్ సాంగ్‌ను రియల్ లైఫ్ కపుల్స్‌తో తెరకెక్కించారు. రీల్ కపుల్ ఆర్య-అనుతో కలిసి ఆ రియల్ కపుల్స్ చేసిన సందడి సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియోకి వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెరపై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ఈ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా సీరియల్ టైటిల్ సాంగ్‌ను రియల్ కపుల్స్‌తో తెరకెక్కించారు. ఇందుకోసం కాంటెస్ట్ నిర్వహించగా.. ఎంతోమంది జంటలు ఆర్య-అనుతో కలిసి టైటిల్ సాంగ్‌లో నటించేందుకు ఆసక్తి కనబర్చారు. చివరకు భవ్యశ్రీ-రాహుల్, దీప్తి-మహేష్, ప్రదీశా-సందీప్ అనే మూడు జంటలను ఎంపిక చేశారు.
ఆర్య-అను జోడీతో పాటు ఆ మూడు జంటలపై సీరియల్ టైటిల్ సాంగ్‌ను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోలో ఆ మూడు జంటల లవ్ స్టోరీలను వారితోనే చెప్పించారు. ఆ బ్యూటీఫుల్ లవ్‌స్టోరీలు, బ్యాక్‌గ్రౌండ్‌లో 'ప్రేమ ఎంత మధురం' సాంగ్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మేకింగ్ వీడియోతో పాటు విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. మేకింగ్ వీడియోకి ఇప్పటికే 4 లక్షల పైచిలుకు వ్యూస్ రాగా.. టైటిల్ సాంగ్ వీడియోకి 1లక్ష పైచిలుకు వ్యూస్ వచ్చాయి.
కాగా, జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే 'ప్రేమ ఎంత మధురం సీరియల్'కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ప్రేమ కథలను ఇష్టపడేవారిని ఈ సీరియల్ కట్టిపడేస్తుంది. ఇక ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంతోమందికి ఫేవరెట్. 'వేయి జన్మలైనా వీడని బంధం మనదిలే.. రేయినైనా కాంతిపంచు చందం నీవులే.. మధురమే.. ప్రేమ మధురమే..' అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో ఇప్పుడు రియల్ కపుల్ సందడి సీరియల్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటోంది.
Also Read: Hero Vishal Injured: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ హీరో విశాల్.. చేతి ఎముక ఫ్రాక్చర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook