Pushpa 2: పుష్ప 2 నుంచి మరోసారి లీక్…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Pushpa 2 Leaked Video: టాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ పుష్ప 2. జోరుగా షూటింగ్ సాగిస్తున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ నుంచి కొన్ని లీకులు చిత్ర బృందాన్ని కలవరపెడుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 01:19 PM IST
Pushpa 2: పుష్ప 2 నుంచి మరోసారి లీక్…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో

Pushpa 2 Leaked Photo:

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2: ది రూల్. 2021 లో వచ్చిన పుష్ప 1: ద రైజ్ మూవీ అంచనాలను మించి రికార్డులు నెలకొల్పింది. అల్లు అర్జున్ మాస్ లుక్స్.. వెరైటీ మేనరిజంకు అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఇక ఈ మూవీలో పాటలు అయితే సెలబ్రిటీలను సైతం స్టెప్పులు వేసేలా చేశాయి. ఈ మూవీ సృష్టించిన రికార్డు తర్వాత నెక్స్ట్ సీక్వెల్ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగినట్టుగానే చిత్ర బృందం అన్ని జాగ్రత్తల మధ్య అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 షూటింగ్ పనులు జోరుగా కొనసాగిస్తున్నారు.

ఈ చిత్రం నుంచి విడుదలైన వెర్ ఇస్ పుష్ప వీడియో.. గంగమ్మ జాతర గెటప్లో అల్లు అర్జున్ పోస్టర్ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక రూపంలో లీక్స్ బయటికి రావడంతో చిత్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూవీ కి సంబంధించి కొన్ని స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆన్ సెట్ లో తీసిన ఈ స్టిల్స్ ఆన్లైన్ లో బాగా వైరల్ అయ్యాయి.

దీంతో బాగా అలర్ట్ అయిన మూవీ టీం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. అయినా సరే నిన్న మళ్లీ మూవీ నుంచి అల్లు అర్జున్ కు సంబంధించి స్టిల్స్ లీక్ అయ్యాయి. అసలు సెట్స్ నుంచి స్టిల్స్ ఇలా ఎలా లీక్ అవుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ లీక్స్ విషయంపై డైరెక్టర్ సుకుమార్ ఎంతో అసంతృప్తిగా ఉన్నారట. మూవీ షూటింగ్ టీం కి ఈ లీకులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.

 

ఇక స్టోరీ విషయానికి వస్తే పుష్ప 2 సినిమాని సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నాడట. మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగంలో కొన్ని కీలకమైన పాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయి అని టాక్. మూవీ కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ గుంతకల్లు నల్లమల అడవీ ప్రాంతంలో జరుగుతుంది . ఇక్కడ ఒక హాయ్ వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను తీయబోతున్నారు. మొత్తానికి ఆగస్టు 15 విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం రెట్టింపు ఆసక్తితో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News