జస్ప్రిత్ బుమ్రాతో ఎఫైర్ రూమర్స్‌పై స్పందించిన రాశి ఖన్నా

టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రాతో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నాకు ఎఫైర్ వుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

Last Updated : Mar 24, 2018, 04:26 PM IST
జస్ప్రిత్ బుమ్రాతో ఎఫైర్ రూమర్స్‌పై స్పందించిన రాశి ఖన్నా

సినిమా హీరోయిన్స్‌కు, క్రికెటర్లకు ముడిపెడుతూ వార్తా కథనాలు వెలువడడం మనం తరచుగా చూస్తుండేదే. అదే కోవలో టీమిండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రాతో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నాకు ఎఫైర్ వుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాశి ఖన్నాకు స్వయంగా స్పందించి వివరణ ఇవ్వక తప్పలేదు. బుమ్రా తనకు ఓ క్రికెటర్‌గా మాత్రమే తెలుసునని, అంతకుమించి మరే సంబంధం తమ మధ్య లేదని రాశిఖన్నా క్లారిటీ ఇచ్చింది. అయినా, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఎలా చెప్పుకుంటారోనని ఆవేదన వ్యక్తంచేసింది రాశి ఖన్నా. ఆ మాటకొస్తే, అసలు తాను ఎవ్వరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని, తాను ఇంకా సింగిలేనని స్పష్టంచేసింది ఈ బ్యూటీ. 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా అనతి కాలంలోనే టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది.  ప్రస్తుతం ఈ అందాల రాశి ఖాతాలో ఎన్టీఆర్ సరసన చేసిన జై లవ కుశ, మెగా హీరో వరుణ్ తేజ్ సరసన చేసిన తొలిప్రేమ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు వున్నాయి. ఈ ఏడాది రాశి మొత్తం నాలుగు సినిమాల్లో నటించేందుకు అంగీకరించగా అందులో మూడు తమిళ చిత్రాలు ఓ తెలుగు సినిమా వున్నాయి.

Trending News