Karthika Nair marriage: నాగచైతన్య మొదటి సినిమా జోష్ తో మనకు పరిచయమైన హీరోయిన్ కార్తీక నాయర్. ఈమె మరెవరో కాదు ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ ని ఏలిన స్టార్ హీరోయిన్ రాధా కూతురు. అప్పట్లో చిరంజీవికి దీటుగా డాన్స్ చేసే హీరోయిన్ ఎవరు అంటే రాధా పేరే చెప్పేవారు. అంతటి పేరుందా రాధా కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చుశారు. అందుకు తగ్గట్టుగానే అక్కినేని వారసుడు నాగచైతన్య మొదటి సినిమాలో కార్తీక హీరోయిన్ గా చేసింది.
ఇక ఆ తరువాత తమిళంలో రంగం లాంటి బ్లాక బస్టర్ సినిమాలో కూడా నటించింది. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తరచన దమ్ము సినిమాలో కూడా కనిపించి మెప్పించింది. అయితే ఈ హీరోయిన్ కి తగినంత పేరు అలానే తగినన్ని ఆఫర్లు మాత్రం రాలేదు. ఫలితంగా దాదాపు ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఇక ఇదే విషయాన్ని తన నిశ్చితార్థం ఉంగరాన్ని హైలైట్ చేసేలా ఓ ఫోటోను అక్టోబర్ నెలలో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తెలియజేసింది ఈ హీరోయిన్. అయితే ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పిన కార్తీక అప్పుడు ఆ ఫోటోలలో తన కాబోయే భర్త ముఖాన్ని రివీల్ చేయలేదు. తాజాగా తను జీవితం పంచుకోబోతున్న వరుడెవరో బయటపెట్టింది. ఇంస్టాగ్రామ్ లో అతని ఫోటోని షేర్ చేస్తూ 'నిన్ను కలవడం విధి.. నీతో ప్రేమలో పడటం ఒక మ్యాజిక్.. నీతో కలిసి జీవితం పంచుకోవడానికి కౌంట్‌డౌన్ ప్రారంభించాను' అని రాసుకొచ్చింది. కార్తీక పెళ్లాడబోయే వ్యక్తి పేరు రోహిత్ మీనన్.
దీంతో రాధ కుమార్తెకు కాబోయే వ్యక్తి ఇతనే అంటూ అంతా ఈ కాబోయే నూతన జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా అతడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!
Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebooసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి