బోస్ పాత్రలో "న్యూటన్" నటుడు

    

Last Updated : Nov 9, 2017, 06:30 PM IST
బోస్ పాత్రలో "న్యూటన్" నటుడు

రాజ్ కుమార్ రావ్.. సిటీ లైట్స్, అలీగఢ్, న్యూటన్ లాంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనదైన పంథాలో దూసుకుపోతున్న యువ నటుడు. జాతీయ అవార్డు గ్రహీతైన రాజ్ కుమార్ ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రలో నటించబోతున్నారు. సుభాష్ చంద్ర బోస్ జీవితకథ ఆధారంగా తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. బాలాజీ టెలిఫిలిమ్స్ వారి సబ్సిడరీ ఏఎల్‌టీ బాలాజీ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నేతాజీ మరణ రహస్యానికి సంబంధించిన కొన్ని అంశాలు ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ఎపిసోడ్స్ రాయడానికి దాదాపు 9 నెలల పరిశోధన చేసి స్క్రిప్ట్ వర్క్ చేశారట మేకర్స్. "బోస్ డెడ్ ఆర్ ఎలైవ్" పేరుతో వచ్చే ఈ వెబ్ సిరీస్ విషయాలను ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు నిర్మాత ఏక్తా కపూర్. న్యూటన్ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న రాజ్‌కుమార్ రావ్ బోస్ పాత్రలో ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాల్సిందే.

Trending News