Purushothamudu Movie Review:‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మూవీ ఎలా ఉందంటే.. !

Purushothamudu Movie Review: రాజ్ తరుణ్ గత కొన్నేళ్లుగా సినిమాల కంటే వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 26, 2024, 05:34 PM IST
Purushothamudu Movie Review:‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మూవీ ఎలా ఉందంటే.. !

రివ్యూ: ‘పురుషోత్తముడు’ (Purushothamudu)
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, ముఖేష్ ఖన్నా  తదితరులు..
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: పీజీ విందా
సంగీతం: గోపీ సుందర్
నిర్మాత: రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్
దర్శకత్వం: రామ్ భీమన
విడుదల తేది: 26-7-2024

రాజ్ తరుణ్.. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. ఈ యేడాది నాగార్జున హీరోగా నటించిన ‘నా సామి రంగ’ సినిమాలో ఓ హీరోగా కనిపించాడు. తాజాగా ఇతను ‘పురుషోత్తముడు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ బ్యాక్ బౌన్స్ అయ్యాడా..లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

రచిత రామ్ (రాజ్ తరుణ్) ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడు. పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళతారు. అక్కడ చదువు పూర్తైయిన తర్వాత   భారత్ తిరిగి వస్తాడు. అయితే.. అతడికి తన కంపెనీకి సీఈవో చేయాలని అతని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే ఈ కంపెనీకి సీఈవో కావాలంటే ఓ విచిత్రమైన నిబంధన ఉంటుంది. వంద రోజులు పాటు ఎవరికీ తెలియకుండా.. హీరో తన ఐడెండిటీ తెలియకుండా గడపాలి. ఈ నేపథ్యంలో అతను సీఈవో కాకుండా.. కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఈ క్రమంలో తాను అజ్ఞాతంలో ఉన్న ఊర్లో ఓ సమస్య వస్తుంది. మొత్తంగా అజ్ఞాతంలో ఉన్న తానుంటున్న ఊరి సమస్యను తీర్చి.. తన కంపెనీకి సీఈవో  అయ్యాడా.. ? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే పురుషోత్తముడు స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అని అర్ధం. అంటే మంచి మనిషి అని అర్ధం. మన ఇతిహాసాల్లో రాముడిని మర్యాద పురుషోత్తముడని కీర్తించారు. అలాగే మన హీరో కూడా మర్యాద పురుషోత్తముడనే ఉద్దేశ్యంతో ఈ సినిమా టైటిల్ పెట్టాడు దర్శకుడు రామ్ భీమన. ఈ సినిమా కథ చూస్తుంటే..గతంలో ఇలాంటి తరహా చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇక కొన్నేళ్ల క్రితం విజయ్ ఆంటోని నటించిన ‘బిచ్చగాడు’తో పాటు మహేష్ బాబు ‘శ్రీమంతుడు, నాని ‘పిల్ల జమీందార్’ వంటి సినిమాలు గుర్తుకు తెస్తాయి. హీరో తాను సాధించే లక్ష్యాల కోసం అజ్ఞాతవాసం చేయాల్సి రావడం. ఈ క్రమంలో అతడు ఎవరనేది చివర్లో తెలియడం. అతడు ఏ కారణంగా అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందనేది అన్ని సినిమాల్లో మాదిరే ఇందులో కూడా రొటిన్ గా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఈ విషయంలో అతను ఓ మాదిరి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.  హీరో రాజమండ్రి దగ్గరలోకి కడియపులంక అనే గ్రామానికి వెళ్లడం.. అక్కడ తాను ఎవరనేది తెలియకుండా వాళ్లలో ఒకటడిగా కలిసి పోవడం వంటివి రొటిన్ గా అనిపించినా.. ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి.

అజ్ఞాతవాసం అనే పాయింట్ ను ఇంకాస్త కన్విన్స్ గా చెబితే బాగుండేది. ముఖ్యంగా ఊరు బాగు కోసం రాజకీయ నాయకులతో తలపడటం వంటివి.. ఇక హీరో లక్ష్యాన్ని సాధించకుండా ఉండడానికి తెర వెనక కొన్ని దుష్ట శక్తులు పనిచేయడం వంటివి రొటిన్ గా ఉన్నా.. అక్కడక్కడ తన సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. సినిమా నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

నటీనటుల విషయానికొస్తే..
రచిత రామ్ పాత్రలో రాజ్ తరుణ్ నటనతో మెచ్చురిటీ కనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన హాసిన సుధీర్ తన గ్లామర్ తో మెప్పించింది. రమ్యకృష్ణ వంటి సీనియర్ నటి తన పాత్రలో మెప్పించింది. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ప్లస్ పాయింట్స్

సినిమా నిడివి

రాజ్ తరుణ్ నటన

మైనస్ పాయింట్స్

రొటిన్ కథ

రేటింగ్: 2.5/5

పంచ్ లైన్.. పురుషోత్తముడు.. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాడు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News