Rajamouli : నా స్వార్ధం అదే.. అసలు విషయం బయట పెట్టిన రాజమౌళి

Rajamouli reveals his selfishness: థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 1130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆర్ఆర్ఆర్ తో మంచి హిట్ కొట్టాక తన స్వార్ధం అదే అంటూ రాజమౌళి కామెంట్ చేశారు.

Last Updated : Jul 2, 2022, 10:43 AM IST
  • ఆర్ఆర్ఆర్ హిట్ కొట్టాక రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
  • తన స్వార్ధం అదేనంటూ బయట పెట్టిన జక్కన్న
  • మహేష్ తో సినిమా కోసం సిద్దం
Rajamouli :  నా స్వార్ధం అదే.. అసలు విషయం బయట పెట్టిన రాజమౌళి

Rajamouli reveals his selfishness: తండ్రి వారసత్వం అందుకుని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత తన తండ్రి ఇచ్చిన కథలతో వరుస సినిమాలు చేసి ఒక్క ఫ్లాప్ కూడా అందుకోకుండా సూపర్ హిట్స్ కొడుతూ వెళుతున్నాడు రాజమౌళి. బాహుబలి 1, 2 సినిమాలతో తెలుగు వాడి సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఆయన తాజాగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ఆ సత్తా చాటి చెప్పినట్లు అయింది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు 1130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది 

ఇక ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ఇతర దేశాలకు చెందిన నటీనటులు, సెలబ్రిటీలు సినిమా చూసి బాగుందంటూ అభినందిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆంగ్ల మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన సినిమాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఆర్ఆర్ఆర్ తో మంచి హిట్ కొట్టాక ఇప్పుడు, భారతీయ కథలు ప్రపంచ స్థాయిలో ప్రదర్శించబడాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. 

ఈ క్రమంలో వాటిని ప్రపంచం ముందుకు తీసుకు వెళ్ళే వారి లిస్టులో నేను ముందు వరుసలో ఉండాలనుకుంటున్నానని, అది నా స్వార్థం” అని రాజమౌళి అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి లాంటి అద్భుతమైన విజయం అందుకున్న తర్వాత తాను చేసే తర్వాతి సినిమా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని అయితే అదృష్టవశాత్తు ఆర్ఆర్ఆర్ ఆ బౌండరీలు అన్నీ దాటేసి తనను ఒత్తిడి నుంచి తగ్గించిందని చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఒక ఆఫ్రికా అడవుల నేపధ్యంలో సాగుతున్న కథ సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే కథ మీద ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని గతంలో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మొత్తం మీద రాజమౌళి తన స్వార్థం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే మహేష్ బాబు సినిమా చేసి విడుదల చేయడానికి మరో రెండు మూడేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Also Read: Shruti Haasan: మొట్ట మొదటిసారిగా రిలేషన్ విషయంలో ఓపెనైన శృతి హాసన్.. పెళ్లి మాత్రం?

Also Read: Rahul Ramakrishna: మళ్లీ నోరుజారిన రాహుల్ రామకృష్ణ… బూతులతో రెచ్చిపోయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x