Shruti Haasan: మొట్ట మొదటిసారిగా రిలేషన్ విషయంలో ఓపెనైన శృతి హాసన్.. పెళ్లి మాత్రం?

shruti haasan opens up:  శృతిహాసన్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విశేషాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించి,  తాను ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 10:46 AM IST
  • రిలేషన్ పై ఓపెన్ అయిన శృతి హాసన్
  • పెళ్లి గురించి ఆసక్తికర మెంట్స్
Shruti Haasan: మొట్ట మొదటిసారిగా రిలేషన్ విషయంలో ఓపెనైన శృతి హాసన్.. పెళ్లి మాత్రం?

Shruti Haasan opens up: కమల్ హాసన్ నట వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన శృతి హాసన్ ఇప్పుడు తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంది. తన తండ్రి ప్రమేయం లేకుండానే సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆమె తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అనేక విశేషాలు పంచుకుంది. ఈ క్రమంలోనే తన పెళ్లికి సంబంధించి,  తాను ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు రిలేషన్షిప్స్ ఉండేవి కానీ వాటి గురించి తన బహిరంగంగా మాట్లాడలేదని ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదని చెప్పుకొచ్చారు. 

అయితే ప్రస్తుతం రిలేషన్ షిప్ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదనిపించిన శృతిహాసన్ అతను ఒక అద్భుతమైన వ్యక్తి అని వెల్లడించింది. ఆమె ప్రస్తుతం శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్ట్ తో డేటింగ్ చేస్తున్నారు. తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అంటే తన పార్ట్నర్ తో సమయం గడపాలనుకుంటున్నానని ఆయనతో కలిసి ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మేం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరీ ఫోటోలు తీస్తున్నారు కాబట్టి మేము ఈ విషయాన్ని దాచాలనుకున్నా దాగదని అందుకే నేను కూడా తనతో ఉన్న రిలేషన్ గురించి దాచాలనుకోవడం లేదని పేర్కొన్నారు.

నా జీవితంలో ఆ అనుబంధానికి చాలా మేజర్ పార్ట్ అంటూ శృతి హాసన్ కామెంట్స్ చేసింది. గతంలో శృతిహాసన్ ఒక విదేశీ వ్యక్తితో కొన్నాళ్లపాటు రిలేషన్ లో ఉంది. అతనితో వివాహం కూడా జరుగుతుందని అనుకున్నారు కానీ ఆ రిలేషన్ పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఇక తాజా ఇంటర్వ్యూలో పెళ్లెప్పుడు అనే విషయం మీద మాత్రం ఆమె ఆసక్తికరంగా స్పందించింది. తనకు ఆ ఉద్దేశమే లేదన్నట్లు ఆమె కామెంట్ చేసింది. రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శృతిహాసన్ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా,  మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా,  ప్రభాస్తో ఒక సినిమా చేస్తుంది. 
Also Read: Rahul Ramakrishna: మళ్ళీ నోరుజారిన రాహుల్ రామకృష్ణ… బూతులతో రెచ్చిపోయి

Also Read: Pavitra Lokesh: నరేష్ తో బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. ప్లీజ్ సపోర్ట్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News