Bharateeyudu 2: రాజశేఖర్ కోసం రాసుకున్న భారతీయుడు కథ.. కమల్ కి ఎలా వెళ్ళిందంటే!

Bharateeyudu 2: మరి కొద్ది రోజుల్లో విడుదలవుతున్న భారతీయుడు 2.. సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శంకర్.. తాజాగా భారతీయుడు గురించి చెప్పిన కొన్ని విషయాలు అభిమానులను షాక్ కి గురిచేస్తున్నాయి. అసలు భారతీయుడు సినిమా కథనే శంకర్ వేరే హీరో.. కోసం రాసుకున్నారట.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 10, 2024, 08:02 PM IST
Bharateeyudu 2: రాజశేఖర్ కోసం రాసుకున్న భారతీయుడు కథ.. కమల్ కి ఎలా వెళ్ళిందంటే!

Bharateeyudu 2 Review: 1996లో శంకర్ దర్శకత్వంలో.. విడుదలైన భారతీయుడు సినిమా.. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఆ సినిమా.. ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం.. చేశారు. తండ్రి సేనాపతి పాత్రలో మాత్రమే కాక కొడుకు చందు పాత్రలో.. కూడా కమల్ హాసన్ కనిపించారు. 

అప్పట్లో బ్లాక్ బస్టర్ అయినా ఈ సినిమాలో.. కమల్ హాసన్ నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో మనం మరెవరిని ఊహించలేనంతగా.. నటించారు ఈ హీరో. అంత బాగా కమల్ హాసన్ ఆ పాత్రలో జీవించారు. కానీ అలాంటి కమల్ హాసన్..ఈ సినిమా కోసం ఫస్ట్ ఛాయిస్ కాదట. 

నిజానికి శంకర్ భారతీయుడు సినిమా కథని.. రజనీకాంత్ లేదా తెలుగు హీరో రాజశేఖర్ కోసం రాసుకున్నారట. కానీ రజనీకాంత్ అందుబాటులో లేకపోవడంతో.. రాజశేఖర్ కన్నా ముందు.. శంకర్ ఆ కథతో కమల్ హాసన్ ను సంప్రదించారట. ఒకవేళ కమల్ హాసన్ కూడా సినిమాకి నో చెప్పి ఉంటే శంకర్..  రాజశేఖర్ కి కథ వినిపించాలని అనుకున్నారట. సేనాపతి పాత్రలో రాజశేఖర్ నటిస్తే కొడుకు చందు పాత్ర కోసం.. వెంకటేష్ ని రంగంలోకి దింపాలని శంకర్ అనుకున్నారట. 

కానీ భారతీయుడు సినిమా కథ కమల్ హాసన్ కి.. బీభత్సంగా చేయడంతో వెంటనే ఓకే చెప్పేసారు. కాబట్టి రాజశేఖర్ దాకా సినిమా కథ వెళ్లలేదు. అయితే నిజంగానే భారతీయుడు సినిమాలో.. కమల్ హాసన్ కి బదులు రాజశేఖర్ నటిస్తే ఎలా ఉండేదో అని ప్రస్తుతం ప్రేక్షకులు ఆలోచనలు చేస్తున్నారు. మరి కొంతమందికి మాత్రం కమల్ హాసన్ కంటే ఆ పాత్ర.. ఇంకెవరికీ బాగా సూట్ అవ్వదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారు. 

ఇక భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా జులై 12న..ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. సిద్ధార్థ, రకుల్ ప్రీత్, ఎస్ జే ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందించారు.

Also Read: Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు

Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News