అంకుశం క‌న్నా గ‌రుడవేగ పెద్ద హిట్

Last Updated : Nov 7, 2017, 08:26 PM IST
అంకుశం క‌న్నా గ‌రుడవేగ పెద్ద హిట్

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రవీణ్ స‌త్తారు డైరక్షన్ లో రాజశేఖర్ హీరోగా తెరపైకి వచ్చిన `పీఎస్‌వీ గ‌రుడ వేగ 123.18ఎం` శుక్రవారం విడుద‌లై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హీరో రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, ` ఏ మూహుర్తాన ప్రవీణ్ స‌త్తారు ఈ క‌థ చెప్పాడో గానీ…సినిమా స‌క్సెస్ కు క‌థే కార‌ణ‌మైంది. నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రమిది. ఇప్పటి వరకు నా కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం `అకుశం` అని చెప్పాను. కానీ గ‌రుడ‌వేగ అంత‌క‌న్నా భారీ విజయాన్ని న‌మోదు చేసింది. సినిమా కోసం నా జీవిత ఎంతో కష్టపడింది. ఎలాగైనా స‌క్సెస్ ఇవ్వాల‌ని సినిమా కోసం చాలా కష్టపడింది. అలాగే ప్రవీణ్ సినిమా కోసం ప‌డిన క‌ష్టం మాటల్లో చెప్పలేను. వాళ్లిద్దరి కష్టానికి ఈరోజు ఫ‌లితం క‌నిపిస్తుంది. ` రాజశేఖర్ వెల్లడించారు.

Trending News