Rajinikanth Discharged From Hospital: హస్పిటల్ నుంచి సూపర్​స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్.. తమిళనాడు సీఎం పరామర్శ

Rajinikanth Discharged From Hospital: సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. తాను ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నట్లు రజనీకాంత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 09:04 AM IST
    • కావేరి హాస్పిటల్ నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
    • రజనీ కోలుకుంటున్నారని చెప్పిన వైద్యులు
    • ఆస్పత్రికి వెళ్లి రజనీని పరామర్శించిన తమిళనాడు సీఎం స్టాలిన్
Rajinikanth Discharged From Hospital: హస్పిటల్ నుంచి సూపర్​స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్.. తమిళనాడు సీఎం పరామర్శ

Rajinikanth Discharged From Hospital: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆదివారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నివాసానికి చేరుకున్నారు. ఉదయం తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నై ఆళ్వారుపేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లి రజనీకాంత్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. గురువారం రాత్రి మగతగా ఉండటం వల్ల రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఆయనకు మెడ నుంచి మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాకులను తొలగించి రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చికిత్స చేశామని, ఆయన కోలుకొంటున్నారని (Rajinikanth Health) ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.   

ఇటీవలే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజనీకాంత్ (Dadasaheb Phalke Award Rajinikanth).. ఢిల్లీ నుంచి తర్వాత హుటాహుటిన ఆసుపత్రిలో చేరడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే రజనీ కాంత్ (Rajinikanth News) జనరల్‌ చెకప్‌ కోసం ఆయన హాస్పిటల్‌కు వెళ్లినట్లు ఆయన భార్య లతా రజనీకాంత్ వెల్లడించారు.

ఆస్పత్రిలో చేరిన తర్వాత రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను (Carotid Artery) గుర్తించామని చెప్పారు. అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారన్నారు. అవసరమైన ట్రీట్‌మెంట్ (Treatment) అందిస్తున్నామని చెప్పారు. ఆదివారం రాత్రి రజనీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Discharge) అయ్యారు. ఇక శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన ‘అన్నాత్తే’ దీపావళికి విడుదల కానుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది.

Also Read: Rajinikanth Health Update : రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌, హెల్త్ బులిటెన్‌ విడుదల '

Also Read: Urmila Matondkar Covid Positive: బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా పాజిటివ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News