Ram Charan New Look : అప్పుడే రామ్ చరణ్‌ లుక్ మార్చేశాడా?.. శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదే

Ram Charan New Look At Formula e race రామ్ చరణ్‌ తాజాగా ఫార్మూలా ఈ రేస్ ఈవెంట్‌లో సందడి చేశాడు. ఈ రేసింగ్ ఈవెంట్లో సచిన్, ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్ వంటి వారు పాల్గొన్నారు. అయితే ఇందులో రామ్ చరణ్‌ లుక్ మారిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 02:45 PM IST
  • హైద్రాబాద్‌లో రేసింగ్ ఈవెంట్
  • సందడి చేసిన మెగా పవర్ స్టార్
  • లుక్ మార్చేసిన రామ్ చరణ్‌
Ram Charan New Look : అప్పుడే రామ్ చరణ్‌ లుక్ మార్చేశాడా?.. శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదే

Ram Charan New Look At Formula e race రామ్ చరణ్‌ మొన్న చార్మినార్‌ వద్ద షూటింగ్ చేశాడు. నిన్న కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్ వద్ద షూటింగ్ చేశాడు. అభ్యుదయ పార్టీ తరుపున రామ్ చరణ్‌ ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇదంతా శంకర్ తీస్తోన్న సినిమా షూటింగ్ కోసమే అని అందరికీ తెలిసిందే. నిన్నటి వరకు ఒక లుక్‌లో కనిపించిన రామ్ చరణ్‌.. నేటి రేసింగ్ ఈవెంట్లో కొత్తగా కనిపించాడు. హెయిర్ కట్ చేసుకుని స్టైల్ మార్చేశాడు.

అంటే మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని అందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని అర్థం అవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌ మూడు విభిన్న లుక్కులో కనిపించబోతోన్న విషయం విదితమే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రాజకీయ నాయకుడిగా, కాలేజ్ కుర్రాడిగా, ఐఏఎస్ అధికారిగానూ కనిపించనున్నాడు.

ఇలా సినిమా మొత్తంలో మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతోన్నాడు. వాటికి సంబంధించిన ఫోటోలు ఆల్రెడీ లీకైన విషయం తెలిసిందే. దిల్ రాజు ఎంతగా కష్టపడ్డా కూడా లీకులను మాత్రం ఆపలేకపోయింది. ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా లీకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. చార్మినార్‌ వద్ద షూటింగ్ జరపగా.. ఆ ఫోటోలు కూడా లీకయ్యాయి.

 

మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు దిల్ రాజు ఓ హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్‌ ఫార్మూలా ఈ రేస్ ఈవెంట్‌లో సచిన్, ఆనంద్ మహీంద్రాలతో కలిసి సందడి చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

రామ్ చరణ్‌ రీసెంట్‌గా ఓ బుల్లి అభిమానిని కలిశాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న బుడ్డోడిలో ధైర్యాన్ని నింపాడు. అభిమాని కోసం విలువైన సమయాన్ని వెచ్చించాడు. ఆ పిల్లాడి కల్లలో ఆనందాన్ని నింపాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానిని చెర్రీ కలిసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

Also Read:  Kalyan Ram Amigos Collections : అత్యంత దారుణంగా అమిగోస్ కలెక్షన్లు.. సుహాస్ కంటే తక్కువ?

Also Read: Shraddha Das Pics : ఆ పార్ట్‌ని మాత్రం క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్దా దాస్.. చూస్తే హీటెక్కాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News