స్టూవర్‌పురం డాన్‌గా రానా దగ్గుబాటి..!

గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకాలో ఉండే స్టువర్టుపురం గురించి తెలియని తెలుగువారు ఉండరు.

Last Updated : Jan 5, 2018, 05:07 PM IST
స్టూవర్‌పురం డాన్‌గా రానా దగ్గుబాటి..!

గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకాలో ఉండే స్టువర్టుపురం గురించి తెలియని తెలుగువారు ఉండరు. ఒకప్పుడు అదే ప్రాంతంలో చాలా మంది దొంగలు ఉండేవారని.. కొందరు దొంగలు ఏళ్ల తరబడి అక్కడ హవా కొనసాగించారని కూడా కథలు ఉన్నాయి. అలాంటి ఓ కరడుగట్టిన దొంగే టైగర్ నాగేశ్వరరావు. రాబిన్ హుడ్ స్టైల్‌లో అతని దొంగతనాలు ఉండేవని వినికిడి.

1970 ప్రాంతాల్లో టైగర్ నాగేశ్వరరావు గురించి రాయని తెలుగు పత్రిక లేదు. అలాంటి వ్యక్తి కథను ఆధారంగా చేసుకొని ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకులు మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీక్రిష్ణ.  ఏకె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించబోయే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలుగులో రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Trending News