రంగస్థలంలో "రామలక్ష్మి"గా సమంత..!

సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత నాయకా, నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’.

Updated: Feb 9, 2018, 12:22 PM IST
రంగస్థలంలో "రామలక్ష్మి"గా సమంత..!

సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత నాయకా, నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ చేసిన పల్లెటూరి పాత్రకు కూడా మంచి రెస్పాన్సే వస్తోంది. అసలు ఇలాంటి పాత్రను చేయడానికి రామ్ చరణ్ ఒప్పుకోవడం సాహసమే అంటున్నారు ఆయన అభిమానులు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ సమంత పాత్ర గురించి ప్రేక్షకులకు ఒక అవగాహన వచ్చేందుకు ఓ కొత్త టీజర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్‌లో పదహారణాల తెలుగింటి అమ్మాయిలా.. అచ్చమైన పల్లెపడుచుగా సమంత కనిపించడం విశేషం.

‘ఓహో ఏం వయ్యారం.. ఏం వయ్యారం.. ఏమాటకామాటే సెప్పుకోవాలి గానీ అండీ.. ఈ పిల్లెదురొత్తుంటే మా ఊరికే 18సంవత్సరాల వయసొచ్చినట్టుగా ఉంటుందండీ..’ అని రామ్ చరణ్ చెబుతుంటే.. సమంత సైకిల్‌పై వయ్యారంగా రావడం గమనార్హం. ‘ఈ సిట్టిగాడి గుండెకాయని గోలెట్టించేసింది ఈ పిల్లేనండి.. పేరు రామలక్ష్మండి..’ అంటూ హీరో హీరోయిన్‌ను పరిచయం చేసే సీన్‌ ఈ టీజర్‌లో ప్రత్యేకతను సంతరించుకుంది.