'Rama Rao' Release Date: రవితేజ '‘రామారావ్ ఆన్ డ్యూటీ’' రిలీజ్ డేట్ ఫిక్స్!

Ravi Teja: మాస్ మహరాజా రవితేజ ‘'రామారావు ఆన్ డ్యూటీ’' సినిమా విడుదల విషయంలో నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తాజాగా కొత్త రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 06:58 PM IST
  • టాలీవుడ్ లో పెద్ద సినిమాలు జోరు
  • రిలీజ్ డేట్లపై కుస్తీలు
  • కన్ఫ్యూజన్‌లో రవితేజ సినిమా
'Rama Rao' Release Date: రవితేజ '‘రామారావ్ ఆన్ డ్యూటీ’' రిలీజ్ డేట్ ఫిక్స్!

'Rama Rao on Duty' Movie Release Date: కరోనా కారణంగా టాలీవుడ్ లో పెద్ద చిత్రాలన్నీ ఇప్పటికే వాయిదా పడ్డాయి. తాజాగా ఆ చిత్రాలన్నీ కొత్త విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. కొవిడ్ (Covid-19) కాస్త తగ్గుముఖం పట్టడంతో..పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం నిన్న ప్రకటించింది. ఇదే బాటలో మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. ఆచార్య, భీమ్లా నాయక్, ఎఫ్ 3, సర్కారు వారి పాట వంటి సినిమాలు కూడా విడుదల తేదీలను ప్రకటించాయి.  భీమ్లా నాయక్ మాత్రం రెండు తేదీలను బ్లాక్ చేసేసింది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న వచ్చేందుకు రెడీ అయింది. 

తాజాగా శరత్  దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ' ('Rama Rao on Duty' Movie). ఈ చిత్రాన్ని మార్చి 25/ ఏప్రిల్‌ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మార్చి 25ను ఆర్ఆర్ఆర్ (RRR Movie) బ్లాక్ చేసింది. ఆర్ఆర్ఆర్‌తో పోటీగా రావడం అనేది అసాధ్యం. ఇక ఏప్రిల్ 14న కేజీయఫ్ చాప్టర్ 2 రానుంది. అది డబ్బింగ్ సినిమా అయినా కూడా ఇక్కడ దానికున్న క్రేజ్ నిమిత్తం భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. ఈ సినిమాల ముందు రవితేజ రామారావు ఏ మాత్రం నిలబడతాడో వేచి చూడాలి.

Also Read: Ghani Movie Release Date: వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ పై నిర్మాతలు క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News