Record Break Movie Review: 'రికార్డ్ బ్రేక్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. ?

Record Break Movie Review: తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో డిఫరెంట్ కాన్సెస్ట్ సినిమాలు వచ్చాయి. అందులో మెజారిటీ చిత్రాలను ప్రేక్షకులు ఆదిరించారు. ఈ రూట్లోనే ప్రముఖ నిర్మా చదలవాడ శ్రీనివాస రావు మెగాఫోన్ పట్టుకొని డైరెక్ట్ చేసిన మూవీ 'రికార్డ్ బ్రేక్'. మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 8, 2024, 05:35 PM IST
Record Break Movie Review: 'రికార్డ్ బ్రేక్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. ?

మూవీ రివ్యూ: 'రికార్డ్ బ్రేక్' (Record Break)
నటీనటులు: నిహార్ కపూర్,నాగార్జున, సత్యకృష్ణ, రగ్దా ఇఫ్తాకర్, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారి, సోనియా కాశీ విశ్వనాథ్ తదితరులు..
కథ: అంజిరెడ్డి శ్రీనివాస్  
సినిమాటోగ్రఫీ: కంతేటి శంకర్
మ్యూజిక్: సాబు వర్గీస్
ఎడిటింగ్: వెలగపూడి రామారావు
నిర్మాత: చదలవాడ పద్మావతి,  
దర్శకత్వం: చదలవాడ శ్రీనివాస రావు

మహా శివరాత్రి పర్వదినం  సందర్భంగా పాన్ ఇండియా మూవీగా రికార్డ్ బ్రేక్ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. చదలవాడ శ్రీనివాస రావు డైరెక్ట్ చేసారు. నిహార్ కపూర్, నాగార్జున ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
 
కోటీశ్వరుల ఇంట పుట్టిన ఇద్దరు చిన్నారులు అనుకోకుండా అనాథలవుతారు. అలా ఇద్దరు అనాథ వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఛాంపియన్స్‌గా ఎలా పోటీలో గెలిచారు ? ఈ అనాథలను ఓ పెద్దావిడా చేరదీసి అమ్మలా మారుతోంది. మరి రెజ్లింగ్ ఛాంపియన్స్ కావాలనుకున్న ఈ ఇద్దరు కోసం ఆమె చేసిన త్యాగం ఏమిటి.. ? రెజ్లింగ్ ఛాంపియన్ కావడానికి వీళ్లిద్దరు ఎలా కష్టపడ్డారన్నదే 'రికార్డ్ బ్రేక్' మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

నిర్మాతగా అపార అనుభవం ఉన్న చదలవాడ శ్రీనివాస రావు.. గతంలో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వంటి బడా స్టార్స్‌తో సినిమాలు చేసారు. ఆ తర్వాత అడపదడపా సినిమాలు నిర్మించారు. ఆ మధ్య బిచ్చగాడు సినిమాను ఈయనే తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకున్నాడు. తాజాగా ఈయన రికార్డ్ బ్రేక్ అంటూ రెజ్లర్ స్టోరీని తీసుకున్నాడు. గతంలో భద్రచలం, తమ్ముడు తరహాలోనే ఈ సినిమా కూడా ఎంగేజింగింగ్‌గా చివరి నిమిషం వరకు హీరోలు రెజ్లింగ్ పోటీ కోసం ఎలా పాట్లు పడ్డారు. చివరకు ఎలా గెలిచారనేది ఎంగేజింగ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో పాత్రల కోసం బాహుబలి వంటి నిహార్ కపూర్, నాగార్జున అసలు సిసలు పహల్వాన్‌లా ఉన్నారు. అంతేకాదు తను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు వీళ్లిద్దరు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలను కూడా  సినిమాలో టచ్ చేస్తూ రైతుల సమస్యతో పాటు తల్లి కొడుకులగా అనుబంధాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో చదలవాడ సక్సెస్ అయ్యారు. తాను అనుకున్న కథను పర్ఫెక్ట్‌గా తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అటు కంతేటి శంకర్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. సాబు వర్గీస్ సంగీతం బాగుంది.

నటీనటుల విషయానికొస్తే..
కొత్త వాళ్లైన నిహార్ కపూర్, నాగార్జున తమ పాత్రలకు న్యాయం చేసారు. అలాగే రగ్దా ఇఫ్తాకర్, సంజన, సోనియా నటన ఆకట్టుకుంటుంది. సత్యకృష్ణ పాత్ర ఈ సినిమాకు వెన్నుముఖగా నిలిచింది. ప్రసన్న కుమార్ నటన పర్వాలేదు. కేవలం హీరో, హీరోయిన్ అని కాకుండా పాత్రలే ఈ సినిమాలో కనిపించాయి.

ప్లస్ పాయింట్స్..

నిహార్ కపూర్ సహా  నటీనటుల నటన

చదలవాడ శ్రీనివాస రావు దర్శకత్వం

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కొత్త నటీనటులు

 

సినిమా నిడివి

పంచ్‌ లైన్.. భారత దేశం సత్తా చాటే'రికార్డ్ బ్రేక్'

రేటింగ్ : 2.75/5

Also Read: Gaami Twitter Review: గామి ట్విట్టర్ రివ్యూ.. విజువల్ వండర్.. ఫిక్స్ అయిపోండి.. పక్కా హిట్..!  

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News