బాలయ్య 102వ సినిమా హీరోయిన్ రెజీనా..?

       

Last Updated : Oct 14, 2017, 07:01 PM IST
బాలయ్య 102వ సినిమా హీరోయిన్ రెజీనా..?

నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ప్రస్తుతం కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నయనతార కాగా, మరో కథానాయిక మలయాళ భామ నటాషా దోషి. ఇక ఈ సినిమాలో మూడో హీరోయిన్‌ కూడా నటించబోతుందని సమాచారం. మొన్నటివరకు ఈ మూడో హీరోయిన్ పోటీలో ప్రగ్యా జైశ్వాల్‌ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ స్థానాన్ని ప్రస్తుతం రెజీనా భర్తీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. "కర్ణ" లేదా "జయసింహ" అనే రెండు పేర్లను ప్రస్తుతం ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. 

Trending News