CV Ananda Bose: ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. రాజ్ భవన్ లో గవర్నర్ పాడుపని.. మండిపడిన సీఎం మమత..

West bengal Governor Cv ananda bose: రాజ్ భవన్ లో పొరుగు సేవల్లో పనిచేసే ఒక యువతి తనను గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించింది. ఈ ఘటన ఒక్కసారిగా దేశంలో తీవ్ర కలకలంగా మారింది. దీనిపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతబెనర్జీ బీజేపీని, గవర్నర్ పై పదునైన విమర్శలు చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 3, 2024, 12:33 PM IST
  • రాజ్ భవన్ లో లైంగిక వేధింపులు..
  • తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ..
CV Ananda Bose: ఎన్నికల వేళ బీజేపీకి షాక్.. రాజ్ భవన్ లో గవర్నర్ పాడుపని.. మండిపడిన సీఎం మమత..

West bengal governor cv ananda bose harassed rajbhavan women employee: ఎన్నికలవేళ దేశంలో ఒక్కసారిగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కర్ణాటకలో.. బీజేపీతో పొత్తులో ఉన్న జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవణపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర వివాదస్పదంగా మారింది. దీనిపై పోలీసుల విచారణ చేపట్టారు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ లో సందేశ్‌ కాళీ ఉదంతంను బీజేపీ, టీఎంసీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేసింది. ఈఘటనపై బీజేపీ నాయకులు మమతను అనేక మార్లు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజ్ భవన్ లో పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఒక యువతి తనను గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ పలుమార్లు లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై యువతి ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదులు చేసింది.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

ఇప్పటి వరకు సందేశ్ ఖాలీ ఘటనలో టీఎంసీని ఆటాడుకున్న బీజీపీకి, ఇప్పుడు బిగ్ షాక్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఈఘటనపై టీఎంసీ మమత స్పందించారు. కేంద్రంలోని బీజేపీ నాయకులను, అదే విధంగా గవర్నర్  సీవీ ఆనంద బోస్‌ పై విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా.. బీజేపీ వాళ్లంతా మాట్లాడేది ఒకటి.. చేసేది మరోకటి ఉంటూ మమత ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. వెస్ట్ బెంగాల్ లోని రాజ్ భవన్ లో బంగ్లాలో  పీస్ రూమ్ లో.. యువతి పొరుగు సేవల కింద పనిచేస్తున్నట్లు సమాచారం.

గవర్నర్  సీవీ ఆనంద బోస్‌ తనపట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేశాడని కూడా యువతి స్థానికంగా ఉన్న...హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కంప్లైంట్  చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఎరచూపి పలుమార్లు గవర్నర్.. లైంగికంగా వేధించారని యువతి ఆరోపణలు చేసినట్లు సమాచారం. 

లైంగిక వేధింపులపై స్పందించిన రాజ్ భవన్..

యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను రాజ్ భవన్ వర్గాలు కొట్టిపారేశాయి. కేవలం ఎన్నికలలో లాభం పొందడానికి ఆడుతున్న డ్రామా అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా.. సదరుయువతి కొందరి ప్రొద్బలం వల్ల అలా లేని ఆరోపణలు చేస్తుందని అన్నారు. దీనిపై  వెస్ట్ బెంగాల్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి స్పందించారు. తనపై కావాలని కొందరు లేని ఆరోపణలు చేస్తున్నారని, తనకు అండగా ఉన్న వారిక ధన్యవాదాలంటూ పోస్టు పెట్టారు. కాగా,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన సీవీ ఆనంద బోస్.. 2022 నవంబర్ 23 నుంచి పశ్చిమ్ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

అయితే.. బీజేపీ సందేశ్ ఖాళీ ఉదంతంలో టీఎంసీని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ కేసులో నిందితుడిని తప్పించేదుకు టీఎంసీ పావులు కదిపిందని కూడా ఎన్నికల ప్రచారంలో బీజేపీ విమర్శలు చేసింది. ఇక తాజాగా, గవర్నర్ ఘటన మాత్రం బీజేపీకి తలనొప్పిగా మారిందిన చెప్పుకొవచ్చు. ఇందులు నిజా నిజాలు ఎంత వరకు ఉన్నా.. కూడా దీన్ని మమతా ఒక అస్త్రంలా ఉపయోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News