అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పాప్ సింగర్ డ్రేక్ గత నెలలో విడుదల చేసిన 'ఇన్ మై ఫీలింగ్స్' ఆల్బం ఇప్పటికీ టాప్ పొజిషన్లో కొనసాగుతూ ఆడియెన్స్‌ని ఉర్రూతలూగించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పాట అంత వైరల్ అవడానికి కారణం ఈ పాట పేరుపై ఓ ఛాలెంజ్ పుట్టుకురావడమే. అవును, 'కికి ఛాలెంజ్' లేదా 'ఇన్ మై ఫీలింగ్స్ ఛాలెంజ్' పేరిట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఛాలెంజ్ హల్చల్ చేస్తోంది. ఈ పాట ప్లే అవుతుండగా కొద్దిపాటి వేగంతో ప్రయాణిస్తున్న కారులోంచి దిగి ఈ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడమే ఈ కికి ఛాలెంజ్ స్వీకరించాల్సిన వాళ్లు చేయాల్సిన పని.
కికి ఛాలెంజ్ తీసుకున్న వాళ్లు ప్రయాణిస్తున్న కారులోంచి దిగి ఆ పాటకు నాలుగు స్టెప్పులేసి తిరిగి కారు ఎక్కి వెళ్లిపోవడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఆ పాట మరింత వైరల్ అయ్యింది. పాశ్చాత్య సంస్కృతి కలిగిన దేశాల్లో ఈ కికి ఛాలెంజ్ మాత్రం ప్రస్తుతం పోలీసులను, ట్రాఫిక్ సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతోంది. ఎందుకంటే రోడ్లపై సైతం కికి ఛాలెంజ్ చేసి ఆ రోడ్డుపై వచ్చీపోయే ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వాళ్లూ లేకపోలేదు.
#inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋
This is the craziness that goes on between shots... 🙄😛
Video and styling: @jaya_stylist
Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt— ReginaCassandra (@ReginaCassandra) July 29, 2018
గత కొద్ది రోజులుగా ఈ కికి ఛాలెంజ్ ఫీవర్ భారతీయులను కూడా పట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నటి రెజినా కాసాండ్ర చేసిన కికి ఛాలెంజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షూటింగ్ జరుగుతుండగా షాట్‌కి షాట్‌కి మధ్య దొరికిన కొద్దిపాటి గ్యాప్‌లో చేసిన కికి ఛాలెంజ్ వీడియోను రెజీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైగా నీ ట్యూన్స్‌కి సౌతిండియన్ గాళ్స్ స్టెప్పులేస్తున్నారంటూ సదరు పాటగాడికి హ్యాష్ ట్యాగ్ చేసింది ఈ హీరోయిన్. కికి ఛాలెంజ్ సంగతేమో కానీ రెజీనా వేసిన స్టెప్పులు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్‌ని బాగా అలరిస్తున్నాయి.