RRR Collections: 'ఆర్ఆర్ఆర్' ఖాతాలో మరో రికార్డు... 10 రోజుల్లోనే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే...

RRR Collections Report: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 03:44 PM IST
  • బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సునామీ
  • కలెక్షన్ల పరంగా రజనీకాంత్ 2.0 చిత్రాన్ని అధిగమించిన ఆర్ఆర్ఆర్
  • 10 రోజుల్లోనే ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే...
RRR Collections: 'ఆర్ఆర్ఆర్' ఖాతాలో మరో రికార్డు... 10 రోజుల్లోనే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే...

RRR Collections Report: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే గుంగూభాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్, బాహుబలి (హిందీ) కలెక్షన్లను క్రాస్ చేసిన 'ఆర్ఆర్ఆర్' తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ '2.0' కలెక్షన్లను క్రాస్ చేసింది. రజనీకాంత్ 2.0 బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.800 కోట్లు గ్రాస్ వసూలు చేయగా... ఆర్ఆర్ఆర్ కేవలం 10 రోజుల్లోనే ఆ మార్క్‌ను దాటేసింది.

ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపై ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ఓ ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్ చిత్రం రూ.819 కోట్ల కలెక్షన్లతో రజనీకాంత్ 2.0 చిత్రం వసూలు చేసిన రూ.800 కోట్ల కలెక్షన్లను అధిగమించింది. దీంతో ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా నిలిచింది.' అని మనోబాల పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ కన్నా ముందు వరుసలో దంగల్, బాహుబలి, భజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు ఉన్నాయి. లాంగ్ రన్‌లో ఆర్ఆర్ఆర్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదు.

మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విడుదలైన అన్నిచోట్ల ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రాంచరణ్, ఎన్టీఆర్‌ల అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మన్యం వీరులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలకు ఫిక్షన్ జోడించి పీరియాడికల్ డ్రామాగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై రాజమౌళి అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలిగారు. ఆర్ఆర్ఆర్ రోరింగ్ హిట్‌తో మేకర్స్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 

Also Read: Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!

KTR vs DK: వాళ్లను బ్యాగ్ సర్దేయండన్న కేటీఆర్.. మధ్యలో కర్ణాటక పీసీసీ చీఫ్ జోక్యం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News