సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతున్న కృష్ణ జింకల వేట కేసు!

తర్వాత సల్మాన్ ఖాన్ మళ్లీ జోధ్‌పూర్ రావడం ఇదే మొదటిసారి

Last Updated : May 6, 2018, 10:31 PM IST
సల్మాన్ ఖాన్‌ని వెంటాడుతున్న కృష్ణ జింకల వేట కేసు!

కృష్ణజింకలను చంపిన కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన అనంతరం బెయిల్‌పై బయటికొచ్చిన సల్మాన్ ఖాన్ ఆదివారం మరోసారి జోధ్‌పూర్‌కి చేరుకున్నాడు. ఇదే కేసుకు సంబంధించి జోధ్‌పూర్ కోర్టులో సోమవారం జరగనున్న విచారణకు హాజరవడం కోసం సల్మాన్ ఖాన్ ఆదివారమే జోధ్‌పూర్ చేరుకున్నాడు. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది. సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటికొస్తుండగా తీసిన చిత్రాలను ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 1998లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో జోధ్ పూర్ అడవులని సందర్శించిన సల్మాన్ ఖాన్.. అక్కడే కృష్ణజింకలను వేటాడి చంపినట్టు అప్పట్లో ఓ కేసు నమోదైంది. దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన ఈ కేసు విచారణలో జోధ్‌పూర్ కోర్టు ఇటీవలే సల్మాన్ ఖాన్‌ని దోషిగా తేల్చుతూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

జోధ్‌పూర్ కోర్టు తీర్పు అనంతరం రెండు రోజులపాటు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించిన సల్మాన్ ఖాన్ అనంతరం బెయిల్ పై విడుదలై ముంబై వచ్చేశాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ మళ్లీ జోధ్‌పూర్ రావడం ఇదే మొదటిసారి. 

  

Trending News