Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!

Samyuktha Menon Upcoming Movies: ఇప్పటికే బాలీవుడ్ లో మంచి పేరున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు సినిమాలతో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తున్న హీరోయిన్లు తక్కువ అనే చెప్పుకోవాలి. అలాంటి సమయంలో కూడా ఇప్పుడు సంయుక్త మీనన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 17, 2024, 11:33 AM IST
Samyuktha Menon: బాలీవుడ్ వలలో పడుతున్న మరొక టాలీవుడ్ హీరోయిన్.. హిట్ దక్కేనా!

Samyuktha Menon in Bollywood: ఇప్పటికే నార్త్ ఇండియా నుంచి చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లో అడుగు పెట్టి ఇక్కడ తమ ఆధిపత్యం చలాయిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లను క్యాస్ట్ చేయడం ఒక ట్రెండ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో పనిచేస్తున్న చాలామంది హీరోయిన్లు నార్త్ నుంచి వచ్చినవారే.

కానీ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ మంచి పేరు సంపాదించిన వైనాలు చాలా తక్కువ. మహా అయితే బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకోగలరు కానీ అక్కడికి వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్లు ఇంకా తక్కువ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా పేరు ఉన్న త్రిష వంటి వారు కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత కూడా మంచి సక్సెస్ అందుకోలేక వెనక్కి వచ్చినవాళ్లే. 

ఈమధ్య సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు ఉన్న నయనతార కూడా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు మరొక టాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ వల లో పడబోతోంది. 

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సంయుక్త మీనన్ బింబిసార, డెవిల్, సర్, విరూపాక్ష ఇలా వరుసగా తెలుగు సినిమాలతో మంచి హిట్లు అందుకొని ఇక్కడే హీరోయున్ గా మంచి పేరు తెచ్చుకుంది. తాజా సమాచారం ప్రకారం ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందట. 

ప్రస్తుతం ఈ మలయాళం బ్యూటీ ముంబైలో అడుగు పెట్టిందట. అక్కడే ఒక ఫేమస్ క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా ఆమెతో కనిపించారు అని తెలుస్తోంది. దీంతో ఈమె కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోంది అని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సంయుక్త మీనన్ ఒక పెద్ద సినిమాకి సైన్ చేసిందని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వస్తుందని కొందరు చెబుతున్నారు. మరి మిగతా హీరోయిన్ల లాగా వెనక్కి వస్తుందా లేక బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తుందా అని వేచి చూడాలి.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News