Rajamouli: నేషనల్ అవార్డ్ సినిమాని బాలేదు అని మొహం పైన చెప్పిన రాజమౌళి.. ఇంతకీ ఏదంటే!

Color Photo Director: సుహాస్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా.. విడుదలైన కలర్ ఫొటో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా.. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా అందుకన్న సంగతి తెలిసిందే. అయితే ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ సినిమా నచ్చలేదట. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 15, 2024, 07:21 PM IST
Rajamouli: నేషనల్ అవార్డ్ సినిమాని బాలేదు అని మొహం పైన చెప్పిన రాజమౌళి.. ఇంతకీ ఏదంటే!

Sandeep Raj: ఒక రైటర్ గా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా సందీప్ రాజ్ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సందీప్ రాజు దర్శకత్వం వహించిన కలర్ ఫొటోస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుహాస్ హీరోగా.. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన కలర్ ఫొటోస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. 

పేరుకి చిన్న సినిమానే అయినప్పటికీ.. భారీ కలెక్షన్లతో పాటు.. ఈ చిత్రం నేషనల్ అవార్డును కూడా అందుకుంది. అయితే చాలామంది ప్రేక్షకులకు ..బీభత్సంగా చేసిన ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళికి మాత్రం నచ్చలేదట. సినిమాలో కొన్ని పాయింట్లు తనకి నచ్చలేదని.. రాజమౌళి స్వయంగా సందీప్ తో చెప్పారట. 

నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత సందీప్ రాజ్ ఒకసారి రాజమౌళిని కలిశారట. అప్పుడు కలర్ ఫోటో సినిమా గురించి మాట్లాడుతూ.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేసినట్లు చెప్పారు సందీప్. రాజమౌళి సినిమా బాగోలేదని సందీప్ రాజ్ మొహం మీద చెప్పారట. 

"నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యా సినిమాలో. నాకు సినిమా నచ్చలేదు అన్నారు. అదేంటి సార్ అని అడిగితే, నువ్వు చాలా కన్విక్షన్ తో తీశావు. నేను క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాను.. కాబట్టి చెబుతున్నాను. లేకపోతే ఏదో తీశారు.. వచ్చింది అని వదిలేసేవాడిని. నాకు సినిమా నచ్చింది కానీ లాస్ట్ లో నేను డిసప్పాయింట్ అయ్యాను. హీరో చచ్చిపోవడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ సినిమా నుంచి గుర్తు పెట్టుకో.. ఒక చావుతో కథ మొదలవ్వాలి కానీ ఎండ్ అవ్వకూడదు. హీరో డెత్ ఎప్పుడు అంటే మరొకచోట.. మంచి జరుగుతుంది.. అంటేనే హీరో చచ్చిపోవాలి. నాకు అది భగవద్గీత" రాజమౌళి చెప్పిన మాటలు తనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లు చెప్పుకొచ్చారు సందీప్ రాజ్.

డైరెక్టర్ గా కలర్ ఫోటో వంటి బ్లాక్ బస్టర్.. సినిమా తీసిన సందీప్ రాజ్ పలు హిట్ సినిమాలకి.. రైటర్ గా కూడా పనిచేశారు. విశ్వక్ సేన్ కీలకపాత్ర పోషించిన ముఖచిత్రం సినిమాకి కూడా సందీప్ రాజ్.. కథ అందించారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను బాగా మెప్పించింది. వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో విశ్వక్ క్యామియో రోల్ లో లాయర్ గా కనిపించారు.

Also Read: Nara Lokesh: యాక్షన్‌ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం

Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News