Sankranthi 2022 Box Office : సంక్రాంతి వార్.. బాలయ్య రాకతో తారుమారు.. చిరు నెగ్గేనా?

Sankranthi 2022 Box Office : ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో సినిమాల సందడి మరీ ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలన్నీ లైన్లో ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 10:06 AM IST
  • సంక్రాంతికి సినిమాల సందడి
  • చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ
  • పెద్ద చిత్రాల పోటీలో నెగ్గేది ఎవరు?
Sankranthi 2022 Box Office : సంక్రాంతి వార్.. బాలయ్య రాకతో తారుమారు.. చిరు నెగ్గేనా?

Sankranthi 2022 Box Office : సంక్రాంతి సందడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలో పండుగ ఒకలా ఉంటే.. బాక్సాఫీస్ వద్ద సందడి ఇంకోలా ఉంటుంది. పెద్ద చిత్రాలన్నీ కూడా సంక్రాంతికి బరిలోకి దిగుతాయి. స్టార్ హీరోల సినిమాలు కనీసం రెండు మూడు పోటీలోకి వస్తాయి. అయితే కొన్ని సార్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ సంక్రాంతికి మాత్రం పోటీ ఉండాల్సిందే అన్నట్టుగా మారుతుంది. అయితే ఇప్పుడు వచ్చే సంక్రాంతి మరింత స్పెషల్‌గా ఉండబోతోంది.

అసలే నందమూరి ఫ్యామిలీ మంచి ఊపు మీదుంది. వరుస హిట్లతో నందమూరి హీరోలు దుమ్ములేపుతున్నారు. అఖండతో బాలయ్య, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, బింబిసారతో కళ్యాణ్ రామ్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేశారు. అదే సమయంలో మెగా ఫ్యామిలీ కాస్త ఢీలా పడింది. ఆచార్య దెబ్బతో మెగా ఫ్యామిలీ వెనక్కి వెళ్లినట్టు అయింది. ఇక గాడ్ ఫాదర్ అంతో ఇంతో పరువునిలబెట్టినట్టు అయింది.

ఇప్పుడు మాత్రం చిరంజీవి, బాలయ్య నేరుగా తలపడబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అంటూ చిరంజీవి వస్తున్నాడు. బాబీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించేశారు. ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతికే వస్తున్నట్టుగా ప్రకటించాడు. నిన్న వీరసింహారెడ్డి అని టైటిల్ ప్రకటించిన బాలయ్య.. సంక్రాంతికి వస్తున్నట్టు చెప్పేశాడు.

దీంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా సాగింది. మెగా వర్సెస్ నందమూరి అన్నట్టుగా ఈ సంక్రాంతి సాగుతుంది. ఇక మళ్లీ ఫ్యాన్ వార్ చెలరెగేలా ఉంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే.. ప్రభాస్ ఆదిపురుష్, దళపతి విజయ్ వారసుడు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. వారసుడు తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆదిపురుష్‌ ప్యాన్ ఇండియాగా రానుంది.

వీటిలో ఆదిపురుష్‌ మీద ఇప్పుడు నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. వారసుడు మీద అంచనాలు మోస్తరుగా ఉన్నాయి. బాలయ్య, చిరు సినిమాలు అయితే మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలానే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం మంచి రంజుమీదుండబోతోంది.

Also Read : Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్

Also Read : Vishnu Manchu Ginna Collections : జిన్నా పరిస్థితి మరీ దారుణంగా.. 50 షోలకు 49 టికెట్లు తెగాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News