Sarkaaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దిన సర్కారు వారి పాట మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా యాంకర్ సుమకిచ్చిన ఇంటర్వ్యూలో చాలా విశేషాలు పంచుకున్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు.
సుమ : టైటిల్ సర్కారు వారి పాట- రాసినప్పుడే అనుకున్నారా... అలా మధ్యలో వచ్చేసిందా..
పరుశురామ్ : అప్పుడది SMB27. టైటిల్‌తోనే వెళ్తే బాగుంటదని ఆలోచించి సర్కారు వారి పాట అనుకున్నాం. టైటిల్ డిజైనింగ్‌కు ఇస్తే లీక్ అయి.. వైరల్ అయింది. ఆ సమయంలో అలా జరుగుతుందేమోనని వారం రోజులు నిద్ర పోకుండా టెన్షన్ పడ్డా. అయినా లీకైంది.
మహేశ్ : నిజానికి అప్పుడు నేను జిమ్‌లో ఉన్నా. ఫోన్ చేశారు. టైటిల్ లీకైందని.. అమెరికాలో అంతా ఇదే మాట్లాడేసుకుంటున్నారని పరుశురామ్ చెప్పారు. మీరేం అనుకుంటున్నారని అడిగితే సర్కారు వారి పాట అనుకుంటున్నా అన్నారు.
సుమ : మహేశ్ గారూ... ఈసారి మే 11న మీ ఫీలింగ్ ఎలా ఉంటది..?
మహేశ్ : మామూలుగా సినిమా రిలీజ్ ముందు యాంగ్జయిటీ, నర్వస్ నెస్‌తో కాస్త టెన్షన్ ఉంటది. కానీ ఈ సారి రిలాక్స్‌డ్ గానే ఉన్నా. రెండేళ్లయింది. సినిమా చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేజ్ చేశాం. పూర్తి చేయటమే బిగ్ సక్సెస్. సినిమాపై ప్రతి వర్గం నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాం అనిపిస్తోంది.
సుమ : సాంగ్స్ చాలా బాగున్నాయి. అంతా కళావతి స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు.. నాకూ 10వేలు అప్పేమైనా ఇస్తారా.. కీర్తి ఎలా చేసింది...
మహేశ్ : ఫస్టాఫ్‌లో నలభై ఐదు నిమిషాలు చాలా అద్భుతంగా ఉంటుంది. థియేటర్ అంతా ఊగిపోయే సీన్స్ ఉంటాయి. సినిమా మొత్తం నా క్యారెక్టర్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో మహానటితో పోలిస్తే కీర్తి చాలా భిన్నంగా కనిపిస్తుంది. కీర్తితో అద్భుతమైన ట్రాక్ ఉంది.
సుమ : ట్విటర్‌లో సర్కారువారి పాట ఎమోజీ రావటం గురించి...
మహేష్ : టీమ్‌కు అభినందనలు. ఇన్నోవేటివ్ ఐడియా.
సుమ : పరుశురామ్ గారు.. అభిమానిగా మహేశ్‌ను డైరక్ట్ చేయాలనుకున్నారు. తీసేటప్పుడు అభిమానం ఎక్కువయేదా.. వన్ మోర్ టేక్ చెప్పాల్సి వచ్చినప్పుడు..
పరశురాం : అభిమానం కథ దాటి వెళ్లొద్దు. జాగ్రత్తగానే ఉన్నా.
మహేశ్ : ఆయనకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ డే ఏ షాట్ ఓకే కాలేదు. నచ్చేదాకా ఓకే చెప్పడు. మీటర్ సెట్ అయిందంటే అది రావాలి. ఓకే అనుకుంటే మాకు తెలిసిపోద్ది. ఫస్ట్ డే రీ టేక్స్. బట్.. తర్వాత కూల్‌గా సాగింది. దూల తీరిపోతుంది సీన్ లాంటి కొన్ని సీన్స్ చాలా టేక్‌లు చేశాం. కానీ కొన్ని ఫస్ట్ టేక్ తీసినవే ఓకే అయ్యాయి. ఆ సీన్ ఆరు టేక్‌లు చేశాం. కానీ ఫస్ట్ దే ఓకే అయింది.
సుమ : సముద్ర ఖని కూడా చేశారు. ఆయన సీనియర్ నటుడు. దర్శకుడు.. ఆయనతో జర్నీ ఎలా సాగింది..
మహేశ్ : ఆ కేరక్టర్ కాస్టింగ్ ఎవరా అనేది ఫైనల్ దాకా చాలా టెన్షన్. దర్శకుడు నేను ఇద్దరం చాలా టెన్షన్ పడ్డాం. రెండు షెడ్యూల్స్ అయిపోయాయి. లాక్డౌన్ కూడా అయిపోయింది. పరశురామ్ పెద్దపెద్ద పేర్లు చెప్పాడు. నేను సముద్రఖని అయితే బాగుంటుందని భావించా. ఆయనైతే ఫ్రెష్‌గా ఉంటదనిపించింది. ఆయనకు వెంటనే ఫోన్ చేసాం. ఆయన కాల్షీట్స్ ఇచ్చారు.ఆయన కూడా ఎగ్జయిట్ అయ్యారు. ఆయన చేయటం వల్ల సినిమాకు టోటల్‌గా ఫ్రెష్‌నెస్ వచ్చింది. బిగ్ థాంక్స్ టు హిమ్. ఆయన్ని అప్పుడప్పుడు పట్టించుకోకుండా మేం మా చాదస్తం వేరే ఉన్నా.. మేమే డిస్కషన్స్, టేక్స్ తీసుకున్నా.. ఆయన పెద్దగా నెగటివ్ ఆలోచించలేదు. అలా ఏం పట్టించుకోలేదు. ఆయన్ని మేం మళ్లీ బ్యాలెన్స్ చేశాం. ఆయన ఈగో చూపించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవారు. షూటింగ్‌లో అద్భుతంగా చేశారు. చివరి రోజు ఆయన నన్ను... మూవీలో చాలా కళ్ల జోళ్లు వాడారు. గుర్తింపుగా ఒక కళ్లజోడివ్వండి అన్నారు. కానీ ఆయన డబ్బింగ్ చూశాక అనిపించింది.. ఆయన్ని ఎక్కడికన్నా తీసుకెళ్లి ఒక కళ్ల జోడు కొట్టేసివ్వాలనిపించింది.
సుమ : పరశుపరామ్ గారూ.. మహేష్ గారు బాగా సెటైర్లు వేస్తారు. మీకేమైనా తగిలాయా..?
పరశురామ్ : సార్ టైమింగ్ అద్భుతంగా ఉంటది. ఆయన కామ్‌గా ఉండి వేసే సెటైర్ డైజెస్ట్ చేసుకోటానికి రెండు సెకన్లు పట్టుద్ది. ఆ తర్వాత రియలైజ్ అవ్వాలి. అదంతా నమ్మలేనట్లుగా ఉంటుంది.
సుమ : సితారతో సాంగ్ చేపించాలని ఎందుకు అనిపించింది..?
మహేశ్ : అది థమన్ ఐడియా. నేను క్లైమాక్స్ సీన్ షూటింగ్ బిజీలో ఉండగానే నమ్రతతో మాట్లాడి ఓకే చేయించేశాడు. నాకు విషయం పూర్తిగా తెలిసే లోపే.. ఓ 3 నుంచి 5రోజుల్లోనే షూటింగ్ చేసేశారు. చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సితార మంచి నటి అవుతుందని నాకు నమ్మకం ఉంది.
సుమ : ఓవర్సీస్ ఫ్యాన్స్‌కు ఏం చెప్తారు.?
ఫస్ట్ చూడబోయేది ఓవర్సీస్ ఫ్యాన్సే. బ్లాస్ట్ పక్కా అని నేను చెప్పగలను.
సుమ : కీర్తికి ఏం సలహా ఇస్తారు మహేష్?
మహేశ్ : మహానటికి ఏం సలహా ఇస్తాం. కీర్తి ఈ సారి కొత్తగా కనిపిస్తుంది.
సుమ : ఈ పాండెమిక్ గ్యాప్‌లో మీరేం నేర్చుకున్నారు?
మహేశ్ : ఈ పాండెమిక్‌లో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నా. పిల్లలుగా ఉన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకోవటం ఈజీ. యంగ్ ఏజ్ వచ్చాక చాలా కష్టం, కానీ నేను నేర్చుకున్నా.
సుమ : ఈ వస్తువుల్లో మీరు తిననివి, మీకు ఇష్టమైనవి? పెరుగన్నం, బర్గర్, పేస్ట్రీ...
మహేశ్ : ఈ మూడు అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు ఎప్పుడో ఓ సారి తింటా.
సుమ : మీరు అభిమానులతో రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని వస్తున్నారు.. మీపైన విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లున్నారు. ఏం చెప్తారు వాళ్లకి.?
మహేశ్ : రెండేళ్లుగా అభిమానులతో దూరం పెరిగింది. మిస్ అవుతున్నా. ఒక అమ్మాయి మిమ్మల్ని టచ్ చేయొచ్చా అంది. అదొక స్వీట్ ఫీలింగ్. చాలా మంది అలా చూస్తూ ఉండిపోతుంటారు. అలాంటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
సుమ : ఫ్యామిలీ కనెక్షన్ ఉందా?
పరశురామ్ : ప్రతి ఒక్కరూ హీరో వాళ్లింట్లో మనిషిలాగే ఫీలవుతారు. బ్యాంకుకు సంబంధించిన కథ.
సుమ : మహేశ్ గారూ..సెల్ ఫోన్, పుస్తకం, రిమోట్‌లలో ఏది ఎక్కువ టైం కావాలనుకుంటారు..
మహేష్ : పుస్తకాలు ఎక్కువ చదువుతా. టోనీ రాబిన్స్ పుస్తకాలు ఇష్టం.
సుమ : వాలెట్ ఆర్ వాచ్ మహేశ్ గారూ..?
మహేశ్ : రెండూ లేవు. లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మధ్య వాచీ పెట్టడం మానేశా.
సుమ : మమ మహేశా సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఎక్స్‌పీరియెన్సెస్ చెప్పండి...
మహేశ్ : ఆ పాట క్రెడిట్ మొత్తం పరుశురామ్, థమన్‌లది. నాకు ఎనర్జీ మొత్తం పోయాక ఫైనల్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ పది రోజుల్లో సెట్ వేశారు. నేను సర్‌ప్రైజ్ అయ్యా. ఓ రెండ్రోజులు ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత షూటింగ్ ఎనర్జిటిక్‌గా జరిగింది. ఆ తర్వాత ఎబ్రాడ్ టూర్ వెళ్లా.
పరశురామ్ : సాంగ్ అయిపోగానే నాకు ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. రెండు చేతులు జోడించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read - Srilanka Clashes: శ్రీలంకలో హింస, అధికార పార్టీ ఎంపీ మృతి
Also Read - LIGER Hunt Theme Out : 'లైగర్' హంట్ థీమ్ విడుదల.. వేటాడే సింహంలా విజయ్ దేవరకొండ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook