రివ్యూ: షరతులు వర్తిస్తాయి (Sharathulu Varthisthai)
నటీ నటులు: చైతన్య రావు, భూమి శెట్టి, నంద కిషోర్, వెంకీ మంకీ, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు తదితరులు
సంగీత దర్శకుడు: అరుణ్ చిలువేరు
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ వానమామలై, శేఖర్ పోచంపల్లి
ఎడిటర్ : Ch.వంశీకృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
నిర్మాత: శ్రీలత - నాగార్జున సామల, శారద -శ్రీజ్ కుమార్ గూండా, విజయ, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు
దర్శకత్వం: కుమార స్వామి
Sharathulu Varthisthai Movie Review: 'షరుతులు వర్తిస్తాయి' ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాస్ వాళ్లు అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు కావడానికి మల్టీ మార్కెటింగ్ వంటి స్కీమ్స్‌కు ఎలా బలి అవుతున్నారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. చైతన్యరావు, భూమి శెట్టి నటించిన ఈ సినిమాను కుమార స్వామి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
చిరంజీవి (చైతన్యరావు) PWD వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. మాములు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. ఇంట్లో పెద్ద దిక్కుగా తల్లిని, తమ్మడి బాధ్యతలు కూడా ఇతనిపైనే ఉంటాయి. మరోవైపు విజయశాంతి (భూమి శెట్టి) ఓ స్టేషనరీ షాపులో పనిచేస్తూ ఫ్యామిలీకి అండగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇద్దరు మిత్రులుగా ఉంటారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఆ నేపథ్యంలో ఆ ఊరుకు చైన్ సిస్టమ్ వంటి చిట్టీల బిజినెస్ వస్తోంది. మీరు డబ్బులు కట్టి మరో ముగ్గురు లేదా నలుగురిని జాయిన్ చేస్తే డబ్బే డబ్బు అంటూ ఆశ చూపుతారు. ఈ క్రమంలో చిరంజీవి, విజయశాంతి ఆ ఉచ్చులో ఎలా చిక్కుకున్నారు.దీని వల్ల ఆ కుటుంబంతో పాటు తెలిసిన వాళ్లు ఎలాంటి బాధలు పడ్డారు. చివరకు చిరంజీవి ఆ ఉచ్చు నుంచి తాను బయటపడటమే కాదు.. తన తోటి వారిని ఎలా బయటపడేసాడనేదే 'షరుతులు వర్తిస్తాయి'అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, విశ్లేషణ..
షరతులు వర్తిస్తాయి సినిమాను దర్శకుడు కుమార స్వామి రోజు మనం పేపర్లో చూసిన సంఘటలనే తీసుకొని ఈ సినిమా కథను వినోదాన్ని, ఎమోషన్‌ను జోడించి తెరపై చాలా చక్కగా తెరపై ఆవిష్కరించాడు. మిడిల్ క్లాస్ వాళ్లు కాస్త డబ్బు వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఎలా మోసపోతారనే విషయాన్ని చూపించాడు. మొదటి భాగం అంతా హీరో, హీరోయిన్ లవ్, సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో చాలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో అసలు కథ నడుస్తోంది. గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ రావడం ప్రజలందరు ఆ కంపెనీ ప్రచారానికి ఎలా మోషపోయారనేది చూపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో ఆడియన్స్‌ను కంటతడి పెట్టేంత ఎమోషన్ ఉంది. విరామం సమయానికి కంపెనీ బోర్డు తిప్పేయడంతో వీళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుందనే పాయింట్ తో సెకాండఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. అలాగే హీరో ఈ గడ్డు పరిస్థితులను ఎలా ఫేస్ చేసి తనతో పాటు తనలాగే మోసపోయిన వాళ్లకు ఎలా న్యాయం చేసాడనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించాడు దర్శకుడు. మొత్తంగా ఈ సినిమా మిడిల్ క్లాస్ వాళ్లకు బాగనే కనెక్ట్ అవుతోంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు.
నటీనటుల విషయానికొస్తే..
నటుడు చైతన్యరావు తొలి సినిమా కంటే మిడిల్ క్లాస్ నేచర్ ఉన్న యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. ఈ సినిమా చూసిన తర్వాత ఇతనికి మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయం స్పష్టమైంది. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. మీరోయిన్‌గా నటించిన భూమి శెట్టి తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. మరోవైపు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు.
పంచ్ లైన్.. మిడిల్ క్లాస్‌ను ఆలోచనలకు అద్దం పట్టే 'షరతులు వర్తిస్తాయి'..
రేటింగ్.. 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter