బాలయ్య సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటున్న శ్రుతీహాసన్..ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు శ్రుతీహాసన్ తీసుకునే పారితోషికంగా ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 06:56 PM IST
బాలయ్య సినిమాకి భారీ పారితోషికం తీసుకుంటున్న శ్రుతీహాసన్..ఎంతో తెలుసా?

NBK 107 Movie: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుసపెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు బాలయ్య. ఇది బాలయ్య కెరీర్ లో 107వ చిత్రం(NBK 107 Movie). ఈ సినిమాలో బాలయ్య జోడిగా శ్రుతీహాసన్(shrutihaasan) నటిస్తోంది. 

Also Read: నందమూరి ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్: బాబాయ్ సినిమాకు ముఖ్య అతిథిగా అబ్బాయ్!

బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టూ..గోపిచంద్‌ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్‌(Thaman‌) అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం శ్రుతీహాసన్‌ తీసుకునే రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Also read: బాలకృష్ణ. మహేశ్‌బాబులతో కొరటాల మల్టీస్టారర్‌ మూవీ?

ఈ మూవీ కోసం శ్రుతీ.. రూ.2 కోట్ల పారితోషికం(Remuneration) డిమాండ్‌ చేసిందట. నిర్మాతలు కూడా శ్రుతీహాసన్‌ డిమాండ్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషికం కావడం గమనార్హం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి ‘'జై బాలయ్య'’అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య.. మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News