Shweta Tiwari: శ్వేతా తివారీ బ్రా సైజులు...దేవుడు తీసుకుంటున్నాడట

Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 28, 2022, 02:07 PM IST
Shweta Tiwari: శ్వేతా తివారీ బ్రా సైజులు...దేవుడు తీసుకుంటున్నాడట

Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అంటే తెలియనివాళ్లెవరూ ఉండరు. ఇటీవల ఖత్రోంకి ఖిలాడీ రియాలిటీ షోతో దుమ్ము రేపేసింది. వయసు నాలుగు పదులు దాటినా ఏ మాత్రం తగ్గని అందం ఆమెది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో నోటి దురుసుతనమో..లేదా నోరు జారడమో ఆమెను రచ్చకీడ్చింది. అసలేం జరిగిందంటే..

శ్వేతా తివారీ (Shweta Tiwari) లేటెస్ట్ వెబ్‌సిరీస్ షో స్టాపర్. వెబ్‌సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కో యాక్టర్ రోహిత్ రాయ్‌తో కలిసి మధ్యప్రదేశ్ భోపాల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడింది. ఈ సందర్బంగా దేవుడిపై జోక్ చేస్తూ..అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై అందరూ దుమ్మెత్తి  పోస్తున్నారు. హిందూవుల మనోభావాన్ని దెబ్బతీసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. భోపాల్‌లోని శ్యామల హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ వ్యవహారంపై స్పందించారు. శ్వేతా తివారి నోటి నుంటి నేను కూడా ఈ మాటలు స్వయంగా విన్నాను. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కచ్చితంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీస్ కమీషనర్‌ను ఆదేశించాను. 

మేరే బ్రా కి సైజెస్ భగవాన్ లే రహే హై ( Mere Bra Ki Sizes Bhagwan Le Rahe Hai)..ఇది శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు. మహాభారత్ ఫేమ్  సౌరభ్ ఈ వెబ్‌సిరీస్‌లో ( Shweta Tiwari Web Series) కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాడు. బ్రా ఫిట్టర్ పాత్రలో కన్పిస్తాడు. అందుకే శ్వేతా తివారీ ఆ మీడియా సమావేశంలో సౌరభ్ పాత్రను ఉద్దేశించి..నా బ్రా సైజులు దేవుడు తీసుకుంటున్నాడంటూ వ్యాఖ్యానించింది. ఇదే ఇప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఆమె ఉద్దేశ్యం ఏదైనా సరే..దేవుడు బ్రా సైజులు తీసుకుంటున్నాడని చెప్పడం మాత్రం కచ్చితంగా మనోభావాల్ని దెబ్బతీయడమేనని కొందరి వాదన. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. 

Also read: Kousalya Covid 19: కరోనా బారిన పడిన కౌసల్య.. తీవ్ర జ్వ‌రం, గొంతు నొప్పితో బాధపడుతున్న సింగర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News