Kissik Video Song Promo: కిస్సిక్ అంటూ ఐటమ్ సాంగ్ అదుర్స్.. మరోసారి సెన్సేషన్ షురూ!

Kissik Promo: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2.. ఐటమ్ సాంగ్ కు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో భారీ వైరల్ గా మారింది. ఈ సాంగ్ పై ఎన్నీ అంచనాలే ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఈ క్రమము ఈ సాంగ్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది.

Written by - Vishnupriya | Last Updated : Nov 23, 2024, 11:52 AM IST
Kissik Video Song Promo: కిస్సిక్ అంటూ ఐటమ్ సాంగ్ అదుర్స్.. మరోసారి సెన్సేషన్ షురూ!

Pushpa 2 Item Song Promo: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్లో పుష్ప-2 సినిమా వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర బృందం వేగం గానే పాల్గొంటూ పలు రకాల అప్డేట్లను తెలియజేస్తూ ఉన్నారు. 

Add Zee News as a Preferred Source

డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలని ఎంపిక చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రేపటి రోజున పుష్ప -2 స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. అంతకంటే ముందుగా ఈ రోజున కిస్సిక్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్. పుష్ప-2 సినిమా నుంచి మాస్ సాంగ్ ప్రోమోని విడుదల చేయగా.. కిస్ కిస్ కిసా అనే వాయిస్ తో శ్రీ లీల తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ కి చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఈ ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో అని ఇప్పుడు విడుదల చేశారు. పూర్తి పాట కోసం రేపటి వరకు ఎదురు చూడక తప్పదు నవంబర్ 24న రాత్రి రూ.7:02 గంటలకు విడుదల కాబోతోంది. 

ఈ కిస్సిక్ పాటను తెలుగు తమిళ్ కన్నడ మూడు భాషల్లోనూ సుబ్లాషిని పాడారు. హిందీలో కూడా ఈమెతో పాటు లోహిత కూడా పాడారు ఇక మలయాళం లో ప్రియా జెర్సన్, బెంగాలీలో సింగర్ ఉజ్జయిని ముఖర్జీ పాడారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇకపోతే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2  కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా నుంచి వచ్చే ఐటమ్ సాంగ్ కోసం అంతకు రెట్టింపు స్థాయిలో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

ఇకపోతే శ్రీ లీలా తన మాస్ పర్ఫామెన్స్ తో అందర్నీ ఆకట్టుకోవడానికి సిద్ధమయింది. ఇక అభిమానులు శ్రీ లీల అందాలకు మాస్ స్టెప్పులకు ఊగిపోవాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.

 

Read more: Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News