Srikanth: బర్త్-డే పార్టీలు తప్ప.. రేవ్ పార్టీలు నాకు తెలియదు: శ్రీకాంత్

Srikanth Rave Party: బెంగుళూరులో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ..ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. చాలామంది తెలుగు నటీనటులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో..ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చర్చలకు దారితీస్తోంది. అందులో మన టాలీవుడ్ నుంచి వినిపించిన ప్రముఖుల పేర్లలో శ్రీకాంత్ పేరు కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ హీరో ఇదే విషయంపై స్పందించారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 20, 2024, 05:20 PM IST
Srikanth: బర్త్-డే పార్టీలు తప్ప.. రేవ్ పార్టీలు నాకు తెలియదు: శ్రీకాంత్

Bangalore Rave Party: బెంగుళూరు శివారు ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి నిర్వ‌హించిన రేవ్ పార్టీకి  సంబంధించి ఎన్నో కీలక విషయాలు.. ఒకదాని తర్వాత ఒకటి బయట పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ పార్టీలో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఇప్పటివరకు తన పైన ఎటువంటి బ్లాక్ మార్క్.. లేని శ్రీకాంత్ పేరు వినిపించడంతో.. తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ఈ క్రమంలో శ్రీకాంత్ ఈ రేవ్ పార్టీకి..త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానస‌లు ఆ పార్టీకే వెళ్ల‌ల‌దేని స్పష్టం  చేశారు. ఈ విషయం గురించి ఆయన పూర్తి వివరణ ఇస్తూ హైదరాబాద్ లోని తన ఇంటి నుంచి వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను ప్రస్తుతం హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లిన‌ట్లు.. పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు.. వార్తలు వస్తున్నాయని నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ కాల్స్ చేశారు. వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవ‌టంతో.. నాకు సంబంధించిన వార్త‌ల‌ను వారు రాయ‌లేదు. అయితే కొన్నింటిలో మాత్రం నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లాన‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో స‌హా మా కుటుంబ స‌భ్యులంద‌రూ న‌వ్వుకున్నాం” అని చెప్పుకొచ్చారు.

 

“మొన్న‌మో వార్తల్లో నా భార్య‌తో నాకు విడాకులు ఇప్పించేశారు. మళ్లీ ఇప్పుడేమో రేవ్ పార్టీకెళ్లాన‌ని అన్నారు. వార్త‌లు రాసిన వాళ్లు తొంద‌ప‌డ‌టంలో త‌ప్పులేద‌నిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, చాలావరకు నాలానే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ఇక అతను ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే ఆ వ్యక్తిని చూసి షాక‌య్యాను. కానీ ద‌య‌చేసి ఎవ‌రూ న‌మ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీల‌కు, ప‌బ్స్ వెళ్లే వ్య‌క్తిని కాను నేను. ఎప్పుడైనా బ‌ర్త్ డే పార్టీల‌కు వెళ్లినా కొద్దిసేపు అక్క‌డి ఉండి వ‌చ్చేస్తానంతే. బర్తడే పార్టీలు తెలుసు కానీ..రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌దు. కాబట్టి మీడియా మిత్రులు స‌హా ఎవ‌రూ న‌మ్మొద్దు. విష‌యం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ యూట్యూబ్లో పెట్టేసి రాసేస్తున్నారు. నాలాగా ఉన్నాడ‌నే మీరు పొర‌బ‌డి ఉంటార‌ని నేను అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ఉన్నాను. ద‌య‌చేసి త‌ప్పుడు క‌థ‌నాల‌ను నమ్మద్దు. ప్రచారం చేయొద్దు,” అని చెప్పుకొచ్చారు.

Also read: Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News