SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు ముహూర్తం ఖరారు.. కొత్త యేడాదిలో ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..

Mahesh Babu - Rajamouli -SSMB29: ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా ట్రైయిన్ అవుతున్నారు.  కానీ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్  ఎపుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా  సెట్స్ పైకి వెళ్లే రోజు రానే వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 1, 2025, 12:31 PM IST
SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు ముహూర్తం ఖరారు.. కొత్త యేడాదిలో ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్  న్యూస్..

Mahesh Babu - Rajamouli -SSMB29: బాహుబలి సినిమాతో మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఓ మార్గం చూపిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ తర్వాత ఇపుడు సూపర్ స్టార్  మహేష్ బాబుతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.  ఈ భారీ చిత్రం ఎపుడు స్టార్ట్ అవుతుందా అని కూడా ఫ్యాన్స్ కూడా కళ్లలో ఒత్తులు వేసుకొని మరి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు.  అంతేకాదు జులపాల జుట్టు పెంచుకొని ప్రత్యేకంగా తయారయ్యాడు.

అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.  మహేష్ బాబును రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. తెలుగులో ఇప్పటి వరకు  ఎవరు చేయడని  డిఫరెంట్ రోల్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  ఈ సినిమా జనవరి 2న రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ వస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు వచ్చి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణాలు, అన్ని పూర్తయ్యినట్టు సమాచారం.ఇప్పటికే లొకేషన్స్ కు సంబంధించిన అన్ని అనుమతులు వచ్చాయట. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఓ సెట్ ను రెడీ చేసారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ మూవీ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ అనే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో  పాటు స్రీన్ ప్లే, డైలాగ్స్ వెర్షన్స్, సినిమాకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన వెర్షన్స్ పూర్తైయినట్టు సమాచారం.  

మహేష్ బాబు, రాజమౌళి సినిమాను  అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.  ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు ఫారెన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు భారతీయ తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు.

భారతీయ, ఇంటర్నేషనల్ నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ చిత్రానికి ‘గరుడ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన దేవర ఫేమ్ జాన్వీ కపూర్ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు నాగార్జున ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.  మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News