SSMB28 for Sankranthi: ఆగస్టు 11 కష్టమే.. సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు?

SSMB 28 Sankranthi Release : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ బాబు 28 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 24, 2023, 11:18 PM IST
SSMB28 for Sankranthi: ఆగస్టు 11 కష్టమే.. సంక్రాంతి బరిలోకి మహేష్ బాబు?

SSMB 28 Aiming Sankranthi: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు ఫిక్స్ చేయకపోవడంతో మహేష్ బాబు 28 అనే పేరుతో సంభోదిర్తిస్తున్నారు. పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ముందుగా సినిమా నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కావడం గగనమే అని తెలుస్తోంది.

దానికి రెండు ముఖ్య కారణాలు అని చెబుతున్నారు. ఒకటి సినిమా షూటింగ్ అప్పటికి పూర్తి చేయడం కష్టమని తెలుస్తోంది. అదేవిధంగా ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయిన తర్వాత దాదాపుగా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయడం పెద్ద అసాధ్యమేమీ కాదు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని దర్శకత్వంలో తనకు ఎక్కుతున్న తమిళ సినిమా జూలై 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్న సినిమా దర్శకుడిగా వ్యవహరిస్తున్న సినిమాలు రెండు వారాల వ్యవధిలో విడుదల కావడం అనేది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు 28 సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2024 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ 2024వ సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉందని మహేష్ బాబు పుట్టినరోజున లేదా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మేరకు అధికారికంగా అనౌన్స్ కూడా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇందులో నిజాలు ఎంతవరకు ఉంటాయనేది.

Also Read: Balagam OTT Release: ఓటీటీలో బలగం సందడి.. దిల్ రాజు పప్పులో కాలేశాడా?

Also Read: Rashmika Mandanna Alert: నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది.. రష్మిక జాగ్రత్తగా మాట్లాడకుంటే ఇబ్బందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News