State Wise Cinema Theatres Count: ఫిలిం ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. డబ్బులేని నిర్మాత ఫైనాన్షియర్ల దగ్గర డబ్బులు అప్పులు చేసి సినిమా నిర్మిస్తారు. దర్శకుడు హీరో హీరోయిన్లు అందరూ సినిమాలో భాగమై దాన్ని పూర్తి చేసి సూపర్ హిట్గా చేసి మళ్ళీ నిర్మాతను లాభాల బాట పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదంతా ఒకరామైన జూదమే, విజయం సాధించే అవకాశాలు తక్కువే అయినా ప్రయత్నం మాత్రం ఆపరు. అయితే తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే హిట్ రేట్ కేవలం 5 నుంచి 10% వరకే ఉంటుంది. అంటే 100 సినిమాలు ఏడాదికి రిలీజ్ అయితే అందులో రిలీజ్ అయినాక హిట్ అయ్యేవి ఐదు నుంచి 10 మాత్రమే ఉంటాయి.
అయితే ఈ సినిమాలను ప్రేక్షకుల వరకు తీసుకువెళ్లేందుకు సినిమా థియేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే మల్టీప్లెక్స్ ల హవా పెరిగిపోయింది కానీ ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ ధియేటర్లో రాజసం వేరేలా ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్ ల ఆరంగ్రేటం వల్ల చాలా సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూతపడి కొన్ని రైస్ మిల్లులుగా మారితే మరికొన్ని పెళ్లి మండపాలుగా మారాయి. అయితే రాష్ట్రాల వ్యాప్తంగా ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయనే విషయాన్ని తాజాగా లోకేశ్వర అనే వ్యక్తి వెల్లడించారు. ఆయన సిద్ధం చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి భారతదేశం మొత్తం మీద 6687 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్లతో కలుపుకుంటే 11 వేల స్క్రీన్స్ ఉన్నాయన్నమాట.
Also Read: Chandrababu Calls Rajinikanth: రజనీకాంత్ కి బాబు ఫోన్.. అభయమిచ్చిన తలైవా!
ముఖ్యంగా ఈ థియేటర్ల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ అని తెలుస్తోంది. రాష్ట్రాలవారీగా థియేటర్లు ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 1097 థియేటర్లు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో 943 థియేటర్లు ఉంటే కర్ణాటకలో 719 థియేటర్లు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 73 థియేటర్లు, తెలంగాణలో 485 ధియేటర్లు, కేరళలో 435 థియేటర్లు, గుజరాత్ లో 425 థియేటర్లు ఉన్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాష్ట్రాలు అన్నింటిలోనూ పెద్ద రాష్ట్రంగా చెప్పబడే ఉత్తరప్రదేశ్లో కేవలం 321 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. ఇక బెంగాల్లో 373 థియేటర్లు ఉండగా బీహార్ లో 315 థియేటర్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 11 థియేటర్లు, హిమాచల్ ప్రదేశ్ లో 15 థియేటర్లు, చత్తీస్గఢ్లో 92 థియేటర్లు, చండీగర్లో 12 థియేటర్లు, పంజాబ్లో 73 థియేటర్లు, హర్యానాలో 72 థియేటర్లు, రాజస్థాన్లో 178 థియేటర్లు, మధ్యప్రదేశ్లో 108 ధియేటర్లు, ఒరిస్సాలో 141 థియేటర్లు, ఝార్ఖండ్లో 59 థియేటర్లు, సిక్కిం రాష్ట్రంలో రెండు థియేటర్లు, అస్సాం రాష్ట్రంలో 61 థియేటర్లు, మేఘాలయ రాష్ట్రంలో ఆరు థియేటర్లు, త్రిపురలో నాలుగు థియేటర్లు, నాగాలాండ్ లో రెండు థియేటర్లు ఉన్నాయి.
ఇక గోవాలో 23 థియేటర్లు ఉండగా దామన్ అండ్ డయూలో 4 థియేటర్లు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక ధియేటర్, పాండిచ్చేరిలో 16 థియేటర్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ లో కానీ మణిపూర్లో కానీ మిజోరాంలో కానీ ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ లోకేశ్వర ఈ సమాచారం మొత్తాన్ని సినిమా ప్రొఫైల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా సేకరించినట్లు వెల్లడించారు. అలా మొత్తం మీద మన దేశంలో 6687 థియేటర్లో ఉన్నాయన్నమాట.
Also Read: Puvvada Ajay Met Jr NTR: ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ మంత్రి.. ఆరోజు షాక్ ఇస్తారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Cinema Theatres: ఏఏ రాష్ట్రంలో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయో తెలుసా? స్టేట్ వైడ్ కౌంట్ ఇదే!