Sudha Kongara Met Accident లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఆమె చేతికి గాయమైనట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సుధా కొంగర ట్వీట్ వేశారు. ఎంతో బాధగా ఉంది.. అయినా ఆ బాధ కూడా బాగుంది.. ఎంతో చిరాకు పెట్టేస్తోంది.. నెల రోజుల పాటుగా ఈ రెస్ట్ తప్పదు.. అనుకోకుండా ఈ బ్రేక్ దొరికింది.. అనుకోని ప్రమాదం అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
Super painful. Super annoying! On a break for a month 😒 #NotTheKindOfBreakIWanted pic.twitter.com/AHVR4Nfumf
— Sudha Kongara (@Sudha_Kongara) February 5, 2023
సుధా కొంగర ప్రస్తుతం బాలీవుడ్లో సూరారై పొట్రూ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఆ సినిమాలో సూర్య నటనకు అంతా ఫిదా అయ్యారు. చివరకు ఇండియా నుంచి అధికారకంగా ఆస్కార్‌కు పంపించారు. కానీ ఆస్కార్ నామినేషన్లో మాత్రం ఈ సినిమాకు అవకాశం దక్కలేదు. కానీ హీరోగా సూర్యకు, దర్శకురాలిగా సుధా కొంగరకు ఫుల్ మార్కులు పడ్డాయి.
దీంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో తీయాలని సుధా కొంగర, సూర్య ప్లాన్ చేశారు. హిందీలో ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నాడు. మొత్తానికి సుధా కొంగర మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది. మరి ఈ రీమేక్ తరువాత ఎలాంటి సినిమా తీస్తుంది.. అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.
ఇక ఓ నెల రోజుల పాటు మాత్రం సుధా కొంగర ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది?.. అసలు ఏమైంది? అనే విషయాలు మాత్రం సుధా కొంగర బయటకు చెప్పలేదు.
Also Read: AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్
Also Read: Samantha : జీవితంలో వెలుగుని వెతుక్కోవాలి.. సమంత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook