Sunny Leone’s Photo: టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నీ హాట్ ఫోటో.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Sunny Leone’s On Hall Ticket: ఒక ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమైన యువతి దానికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్ లోడ్ చేస్తే అందులో సన్నీ లియోన్ దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Last Updated : Nov 9, 2022, 03:49 PM IST
Sunny Leone’s Photo: టీచర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ పై సన్నీ హాట్ ఫోటో.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Sunny Leone’s Photo Appears On Hall Ticket: ఒకప్పటి పోర్న్ స్టార్, ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాత తరం వారికి ఆమె గురించి తెలియకపోవచ్చు కానీ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఆమె గురించి తెలిసే ఉంటుంది/ భారత సంతతికి చెందిన ఆమె అమెరికాలో పోర్న్ ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు పని చేసి ఆ తర్వాత దాని నుంచి విరమించుకొని బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఆమెతో పలు తెలుగు సినిమాలు కూడా చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే మంచు విష్ణు హీరోగా జిన్నా అనే సినిమాలో కూడా ఆమెకు ఒక మంచి రోల్ దక్కింది. ఇప్పుడు ఈ సంగతంతా ఎందుకంటే తన హాల్ టికెట్ ఫోటో ఉండాల్సిన చోట సన్నీలియోన్ ఫోటో చూసి ఒక యువతి షాక్ కి గురైంది. అసలు విషయం ఏమిటంటే ఒక యువతి కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపద్యంలోనే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుంది.

అయితే హాల్ టికెట్లు తన ఫోటో బదులు సన్నీలియోన్ ఫోటో ముదిరించి ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఈ విషయాన్ని ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో అర్థం కాక వెంటనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అని సలహాలు కోరింది. ఈ దెబ్బకి ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే అక్కడి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ విషయం మీద ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ విద్యాశాఖ స్పందించింది.

అభ్యర్థి ఫోటో తప్పుగా ముద్రించబడింది అని దాన్ని వెంటనే మారుస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నిజానికి అసలు అభ్యర్థి తమ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వారు ఏ ఫోటో కనుక అప్లోడ్ చేస్తే దాన్ని సిస్టం తీసుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది, ఆమె పొరపాటున తన ఫోటో బదులు సన్నిలియోన్ ఫోటో అప్లోడ్ చేశారా అనే విషయం మీద సంబంధించిన అభ్యర్థిని వాకబు చేస్తే ఆమె తనకు తెలియదని తన భర్త స్నేహితుడు ఒకరు తన వివరాలు అప్లోడ్ చేశారని చెప్పారని ఈ క్రమంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఫోటో ఎవరు అప్లోడ్ చేశారో తెలిస్తే ఈ విషయం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏది ఏమైనా సన్నీ లియోని ఫోటో వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పక తప్పదు.

Also Read: Chiranjeevi vs Balakrishna: హిట్లు లేకున్నా మెగాస్టారే.. సీమలో బాలయ్యను చిత్తు చేసిన బాలకృష్ణ!

Also Read: Suhana Khan Pics: గోల్డెన్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సుహానా ఖాన్.. నాభి అందాలతో రచ్చ చేస్తోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News