Mahesh Babu: తొలిసారి మహేశ్ బాబు డ్యూయల్ రోల్..! ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

Mahesh Babu Double Role in SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇంకా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టకముందే రోజుకో పూకారు బయటకు వస్తోంది. తాజాగా మహేశ్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది.    

Written by - Ashok Krindinti | Last Updated : Mar 12, 2024, 11:38 PM IST
Mahesh Babu: తొలిసారి మహేశ్ బాబు డ్యూయల్ రోల్..! ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

Mahesh Babu Double Role in SSMB29: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ మహేశ్ బాబు-రాజమౌళి మూవీ. హాలీవుడ్ స్థాయిలో ఇండస్ట్రీని షేక్ చేసేలా జక్కన్న ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి రోజుకో వార్త తెరపైకి వస్తోంది. తాజాగా మరో సరికొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఓ రేంజ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని విషయం తెలిసి మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం మూవీలో డబుల్ యాక్షన్ చేసిన మహేశ్ బాబు.. మళ్లీ డ్యూయల్ రోల్ చేయలేదు. అటు రాజమౌళి విక్రమార్కుడు, బాహుబలి సినిమాల్లో డ్యూయల్ రోల్ చేయించి సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజాగా మహేశ్ డ్యూయల్ రోల్ న్యూస్ టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా.. కథ, స్క్రిప్ట్ పరంగా డ్యూయల్ రోల్ గురించి చర్చ లేదని మూవీ మేకర్స్ చెబుతున్నారు.

Also Read: Gangstars Marriage: అంగరంగ వైభవంగా గ్యాంగ్‌స్టర్ల పెళ్లి.. ఖైదీలు, గూండాలు, రౌడీలే అతిథులు

ప్రీ ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటుల వేట కూడా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో వివిధ భాషలకు సంబంధించిన నటులు యాక్ట్ చేయనున్నారు. స్టోరీకి అనుగుణంగా నటుల కోసం మేకర్స్ వెతుకుతున్నారు. బాలీవుడ్ టాప్ యాక్టర్స్‌లో ఇద్దరికి స్క్రిప్ట్ చెప్పినట్లు తెలుస్తోంది. నటీనటులపై అతి త్వరలోనే క్లారిటీ రానుంది. కేఎల్ నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా నెవర్ బిఫోర్ అనే విధంగా ఉండబోతుందని అంటున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్‌పై జక్కన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబుపై టెస్ట్ షూట్స్ కూడా చేశారు. మొత్తం 8 లుక్స్ ట్రై చేసి.. మూడింటిని ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. స్పెషల్ డైట్ తీసుకోవడం మొదలు పెట్టాడట. యాక్ష‌న్ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో  స్టంట్స్ యాక్షన్ సీన్స్‌కు ప్రాముఖ్య‌త ఉన్నాయి. ఇందుకోసం సూపర్ స్టార్ జర్మనీ వెళ్లి.. అక్కడ ప్రముఖ వ్యాయామ నిపుణులు హ్యారీ కొనిగ్‌తో కలిసి ట్రెక్కింగ్‌తో పాటు ప‌లు వ్యాయామాలు చేస్తున్నాడట. యాక్షన్ సీన్స్‌లో కూడా ట్రైయినింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఉగాది సందర్భంగా SSMB29 మూవీ షూటింగ్‌కు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Diarrhea After Eating Bananas: అరటిపండ్లు తిన్న వెంటనే మలవిసర్జన..కారణాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x