Telangana Folk Singer Suicide: తెలంగాణ ఫోక్ సింగర్ ఆత్మహత్య..

Telangana Folk Singer Suicide: తెలంగాణ జానపద పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరించిన ప్రముఖ గాయని శృతి ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న  శృతి తాజాగా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.  ఆమె అకాల మరణం చెందడంపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 19, 2024, 07:54 AM IST
Telangana Folk Singer Suicide: తెలంగాణ ఫోక్ సింగర్ ఆత్మహత్య..

Telangana Folk Singer Suicide: తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది శృతి. అయితే కట్నం కోసం అత్తింటి వారే ఆమెను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శృతికి చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి ఫేమ్ సంపాదించుకుంది.   ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం  ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.

20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత  శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి అప్పటి నుంచి కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతి వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే ఈ వేధింపులకు గురి కావడంతో తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు  పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News