మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్... డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న సూపర్ స్టార్..!

Mahesh Babu Trivikram Movie Updates: సూపర్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 09:13 AM IST
  • మహేష్-త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్స్
  • సినిమాలో మహేష్ పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్
  • మహేష్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్
మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్‌డేట్... డ్యూయల్ రోల్‌లో కనిపించనున్న సూపర్ స్టార్..!

Mahesh Babu Trivikram Movie Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాపై ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకొస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ తెరపైకి వచ్చింది. సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్. త్రివిక్రమ్ ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించనున్నాడని... ఇందులో మహేష్ ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ పాత్రల్లో కనిపించనున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

సినిమాలో మహేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సినీ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను పక్కా చేశారు. ఫిబ్రవరిలో పూజా ముహూర్తంతో అధికారికంగా లాంచ్ అయిన ఈ సినిమా... వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికైతే ఈ సినిమా కథేంటన్నది రివీల్ అవలేదు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. లేదు లవ్ అండ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే సినిమా అని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్‌ను సరికొత్తగా పరిచయం చేసిన త్రివిక్రమ్... ఈ సినిమాతో మహేష్‌ను మరింత కొత్తగా ఆవిష్కరిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. నందమూరి హీరో తారకరత్న ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 

Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో టాప్ ప్లేయర్స్ వీళ్లే.. చెత్త రికార్డులు ఇవే!

Also Read: Sidhu Moose Wala Murder: సిద్ధూపై ఏకె 94 రైఫిల్స్‌తో 30 రౌండ్ల కాల్పులు... సింగర్ చావును ముందే ఊహించాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News