Sarath Kumar: 'నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది'..

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ సంస్మరణ సభ మంగళవారం బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువరు సినీ, రాజకీయ ప్రముఖలు పాల్గొన్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 09:42 AM IST
 Sarath Kumar: 'నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది'..

sarathkumar emotional words about puneeth rajkumar: కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం యావత్ సినీ ప్రపంచాన్ని  శోక సంద్రంలో ముంచేసింది. పునీత్(puneeth rajkumar) చనిపోయి 20 రోజులు గడుస్తున్నా ..ఇప్పటికీ ఆయన మరణవార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళవారం బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో పునీత్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

ఈ సభలో పాల్గొన్న తమిళ సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌(actor sarathkumar)..పునీత్‌ను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. 'పునీత్‌ బదులు నేను చనిపోయినా బాగుండేది. ఇదే వేదికపై రాజకుమార​ మూవీ(Raj Kumara Movie) 100రోజుల వేడుక జరిగింది. ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా.. కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది' అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు శరత్ కుమార్.

Also read: Karnataka Ratna Award 2021: మరణాంతరం పునీత్ కు అరుదైన గౌరవం.. ‘కర్ణాటక రత్న’ అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం

2017లో రాజకుమార సినిమాలో పునీత్‌కు తండ్రిగా నటించారు శరత్‌కుమార్‌. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ ఇప్పుడు పునీత్‌ చివరి సినిమా జేమ్స్‌(James Movie)లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. పునీత్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు.

పునీత్ అంతిమ యాత్రకు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యులను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రానా, వెంకటేష్, శ్రీకాంత్, అలీ, రామ్ చరణ్, సూర్య, జయప్రద ఇలా పలువురు పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News